మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, కాగా సినిమా 10 రోజులు పూర్తీ అయ్యే సరికి టోటల్ వరల్డ్ వైడ్ గా 128 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా అందులో తెలుగు రాష్ట్రాల నుండే మేజర్ వసూళ్లు వచ్చాయి. ఇక సినిమా ను టోటల్ గా 187 కోట్లకు పైగా అమ్మారు.
అందులో రెండు తెలుగు రాష్ట్రాలలో 107 కోట్ల లోపు రేటు కి అమ్మారు. కాగా టోటల్ గా అన్ని ఏరియాల లోకి ఇప్పుడు మొదట గా బ్రేక్ ఈవెన్ అయిన ఏరియా గా నైజాం ఏరియా నిలిచింది. ఈ ఏరియా లో సినిమా ను సుమారు 28 కోట్లకు అమ్మారు. దాంతో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న…
అనుమానాలు రేకెత్తాయి…డానికి కారణం మెగాస్టార్ మైటీ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 అన్ని ఏరియాల్లో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా నైజాం లో మాత్రం 19.5 కోట్ల రేంజ్ లోనే వసూళ్లు సాధించింది. దాంతో ఇప్పుడు అంత మొత్తం రికవరీ అవుతుందో లేదో అన్న డౌట్ ఉండగా కేవలం 10 రోజుల లోనే…
బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని ఈ ఏరియాలో సొంతం చేసుకుంది సినిమా. ఒక సారి ఇక్కడ రోజువారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Day1: 8.10c
?Day2: 3.98C
?Day3: 2.55C
?Day4: 2.57C
?Day5: 2.48C
?Day6: 1.96C
?Day7: 2.28C
?Day8: 2.48C
?Day9: 1.30C
?Day10:88L
?Day11:1.12C
Total : 29.70cr ☑️ సినిమా 11 వ రోజు మళ్ళీ జోరు చూపి 1.12 కోట్ల షేర్ ని ఇక్కడ అందుకుంది.
దాంతో టోటల్ గా 11 రోజుల వసూళ్లు కలిపి 29.7 కోట్ల మార్క్ ని అందుకోగా సినిమా బిజినెస్ పై ఇప్పటికే 1.7 కోట్ల దాకా ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ లో ఇక్కడ సినిమా జోరు ఇలాగే కొనసాగితే మరింత దూరం వెళ్లి సంచలనం సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.