Home గాసిప్స్ సైరా హిందీ లో ఇప్పటి వరకు కన్ఫాం అయిన థియేటర్స్ ఎన్నో తెలుసా?

సైరా హిందీ లో ఇప్పటి వరకు కన్ఫాం అయిన థియేటర్స్ ఎన్నో తెలుసా?

0

  

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా అక్టోబర్ 2 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుండగా సినిమా తెలుగు తో పాటు తమిళ్, కన్నడ మరియు హిందీ లో కూడా డబ్ అయ్యి రిలీజ్ కాబోతుంది. అన్ని భాషల్లోకి ఎక్కువ మార్కెట్ ఉండే హిందీ లో సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవ్వాలని అందరు కోరుకుంటున్నారు.

కానీ హిందీ లో కమర్షియల్ మాస్ మూవీ వార్ భారీ ఎత్తున అక్టోబర్ 2 న రిలీజ్ కానుండటం తో ఆ ఎఫెక్ట్ హిందీ వర్షన్ సైరా పై పడనుంది. కానీ హిందీ వర్షన్ సైరా ట్రైలర్ కి అక్కడ చాలా వరకు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. దాంతో సినిమా కి డిమాండ్ ఏర్పడింది.

కాగా సినిమా ను అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఎక్సెల్ వారు సినిమా కి థియేటర్స్ ని మెల్లి మెల్లిగా పెంచుతూ పోతున్నారు. కాగా ఇప్పటి వరకు కన్ఫాం అయిన థియేటర్స్ కౌంట్ 1400 వరకు వెళ్లిందని సమాచారం. ఇంకా పూర్తీ కౌంట్ కంప్లీట్ కాలేదు కానీ ఫైనల్ గా థియేటర్ కౌంట్….

1800 నుండి 2000 వరకు వెళ్ళే అవకాశం ఉందట. ఇది వరకు 2300 వరకు ఫైనల్ థియేటర్ కౌంట్ ఉంటుంది అనుకున్నా రీసెంట్ గా హాలీవుడ్ మూవీ జోకర్ రిలీజ్ డేట్ ప్రీ పోన్ అవ్వడం తో ఆ సినిమా కి కూడా థియేటర్స్ బాగానే అరేంజ్ చేస్తున్నారు.

దాంతో సైరా ఫైనల్ హిందీ వర్షన్ థియేటర్ కౌంట్ ఇప్పుడు 1800 నుండి 2000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక మిగిలిన భాషల్లో కూడా సినిమా భారీ ఎత్తునే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక అక్టోబర్ 2 న పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here