Home న్యూస్ మెగాస్టారా మజాకా…కన్నడ గడ్డపై 350+!!

మెగాస్టారా మజాకా…కన్నడ గడ్డపై 350+!!

0

     మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఇక్కడ ఎలాంటి క్రేజ్ ఉంటుందో పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా క్రేజ్ పీక్స్ లో ఉంటుంది, ఇక 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 సినిమా ఇక్కడ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అక్కడ కూడా సరికొత్త రికార్డులతో దుమ్ము లేపింది. ఇప్పుడు అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి భారీ ఎత్తున అక్టోబర్ 2 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

కాగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతానికి 1250 థియేటర్స్ లో రిలీజ్ ని కన్ఫాం చేసుకోగా కర్ణాటక లో కూడా రికార్డ్ లెవల్ లో రిలీజ్ కాబోతుంది. అక్కడ పోటి లో ఇతర సినిమా లు ఉన్నా కానీ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా…

350 వరకు థియేటర్స్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకున్న సినిమా అక్టోబర్ 2 వరకు 400 కి అటూ ఇటూ గా థియేటర్స్ ని అక్కడ కన్ఫాం చేసుకోబోతుందట. బాహుబలి తర్వాత అక్కడ ఆ రేంజ్ లో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్న సినిమా ఇదే అని చెప్పాలి.

రీసెంట్ బిగ్ మూవీస్ లో సాహో అక్కడ 370 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేయనున్న సైరా వార్, లోకల్ మూవీస్, హాలీవుడ్ మూవీ జోకర్ నుండి అక్కడ కూడా పోటి ని ఎదురుకుంటున్నా కానీ భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

కాగా ఈ థియేటర్స్ లో తెలుగు వర్షన్ తో పాటు కన్నడ డబ్ అలాగే అన్ని భాషాల డబ్ వర్షన్ అక్కడ రిలీజ్ అవుతుందని సమాచారం. మరి ఫైనల్ కౌంట్ 400 ని టచ్ చేస్తే మాత్రం ఇంత పోటి లో ఆ మార్క్ ని అందుకోవడం ఓ గొప్ప విశేషం అవుతుందని చెప్పొచ్చు. ఫైనల్ కౌంట్ ఎంతవరకు వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here