Home న్యూస్ సైరా నరసింహా రెడ్డి…సెన్సార్ రివ్యూ!!!

సైరా నరసింహా రెడ్డి…సెన్సార్ రివ్యూ!!!

0

       2019 ఇయర్ టాలీవుడ్ వన్ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన సినిమా సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి రెండున్నర ఏళ్లుగా కష్టపడి చేసిన ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆశాగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా అత్యంత భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుండగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుంది…

ఓవరాల్ గా యు/ఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఫైనల్ రన్ టైం 2 గంటల 50 నిమిషాలు ఉందని సమాచారం. ఇక సినిమా కి సెన్సార్ వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ దక్కింది అన్నది బయటికి వచ్చేసింది.. ఆ వచ్చేసిన టాక్ ప్రకారం…

సినిమా ఓవరాల్ గా గూస్ బంప్స్ తెప్పించే స్టొరీ అని అంటున్నారు. కథ పాయింట్ ఏంటో అందరికీ తెలిసిందే అయినా విజువలైజేషన్ పరంగా గ్రాండియర్ పరంగా భారీ సెట్టింగ్స్ పరంగా రీసెంట్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ కి సైరా ఏమాత్రం తీసి పోనీ విధంగా ఉందని అంటున్నారు.

ఇక సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే… సైరా నరసింహా రెడ్డి మొదటి సరి బ్రిటిష్ కోట గోడలు బద్దలు కొట్టుకుని వెళ్ళే సీన్, ఇంటర్వెల్ సీన్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ తో పాటు వార్ సీన్స్ ఓ రేంజ్ లో వచ్చాయట. వీటికి తోడూ సైరా టైటిల్ సాంగ్ వెండితెరపై మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు.

ఇక సినిమా కి ఉన్న డ్రా బ్యాక్స్ కూడా చెబుతూ…. లెంత్ ఎక్కువ అవ్వడం..సినిమా కొంచం స్లో నరేషన్ తో ఉండటం మాత్రమె చిన్న మైనస్ పాయింట్స్ అని అంటున్నారు. మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ కి ఇతర లీడ్ కాస్ట్ యాక్టింగ్ కి అల్టిమేట్ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారట వారు.

మొత్తం మీద సెన్సార్ నుండి సినిమా కి అద్బుతమైన టాక్ అయితే బయటికి వచ్చింది. చాలా వరకు పెద్ద సినిమాలకు సెన్సార్ టాక్ ఇలానే ఉంటుంది కానీ సైరా విషయం లో అది కొంచం ఎక్కువే ఉండటం తో ఇదే రేంజ్ రెగ్యులర్ షోలకు టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here