Home న్యూస్ అజ్ఞాతవాసి(420), రంగస్థలం(240), అరవింద సమేత(250), మహర్షి(265)…సైరా రేంజ్ ఎంతో తెలుసా??

అజ్ఞాతవాసి(420), రంగస్థలం(240), అరవింద సమేత(250), మహర్షి(265)…సైరా రేంజ్ ఎంతో తెలుసా??

0

      టాలీవుడ్ లో రీసెంట్ టైం లో క్రేజ్ ఉన్న సినిమాలు రికార్డ్ లెవల్ లో రిలీజ్ అవుతూ దూసుకు పోతున్నాయి. కొన్ని సినిమాలకు టాక్ కి అతీతంగా భారీ రిలీజ్ లు సొంతం కాగా కొన్ని సినిమాలకు రిలీజ్ తర్వాత కూడా భారీ గా థియేటర్స్ ని పెంచుకున్నాయి. అవన్నీ ఇక్కడ లోకల్ లో ఎక్కువగా జరగగా ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాల పరంగా కొన్ని సినిమాలు భారీ ఎత్తున రిలీజ్ అయ్యాయి..

ముఖ్యంగా అమెరికాలో తెలుగు సినిమాలను ఎక్కువ గా ఆదరిస్తారు కాబట్టి మన సినిమాలను అక్కడ రాను రాను మరింత భారీ లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ టైం లో అమెరికాలో తెలుగు సినిమాల పరంగా హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా గా అజ్ఞాతవాసి ఆల్ టైం రికార్డ్ కొట్టింది.

ఏకంగా 420 కి పైగా థియేటర్స్ లో అక్కడ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది ఆ సినిమా.. తర్వాత కొన్ని కొన్ని సినిమాలు 300 థియేటర్స్ లో కూడా రిలీజ్ అయ్యాయి. ఇక బాహుబలి సిరీస్ లో పార్ట్ 1 500 కి పైగా థియేటర్స్ లో పార్ట్ 2 1200 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సాహో నాన్ బాహుబలి రికార్డ్ లెవల్ లో 1100 కి పైగా థియేటర్స్ లో అక్కడ రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు భారీ పోటి లో రిలీజ్ అవుతున్న సైరా కి మరీ ఈ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో అయితే దొరకలేదు కానీ ఉన్నంతలో 310 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కన్ఫాం అయ్యింది.

ఒకసారి అక్కడ రీసెంట్ టైం లో టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల థియేటర్స్ కౌంట్ ని పరిశీలిస్తే…
?#Agnyaathavaasi-420
?#Rangasthalam-240
?#BharatAneNenu-320
?#Naaperusurya-140
?#AravindhaSametha-255
?#VVR-240
?#maharshi -270
?#Saaho-1100
?#SyeRaaNarasimhaReddy-310+

ఇప్పుడు జోకర్ అండ్ వార్ సినిమాలతో పోటి పడుతున్న సైరా సినిమా టోటల్ గా 310 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా స్పెషల్ ఆఫర్ కింద టికెట్ కొంటె టికెట్ ఫ్రీ ఆఫర్ ఉంది.. దాంతో సినిమా అక్కడ ప్రీమియర్స్ తో సంచలనాలు నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here