Home న్యూస్ 3 నిమిషాల్లో ఇండియా..6 నిమిషాల్లో వరల్డ్ వైడ్…2 లక్షల ట్వీట్స్…మెగాస్టార్ పవర్ ఇది!!

3 నిమిషాల్లో ఇండియా..6 నిమిషాల్లో వరల్డ్ వైడ్…2 లక్షల ట్వీట్స్…మెగాస్టార్ పవర్ ఇది!!

0

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ ట్రైలర్ భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసే విధంగా ఉందని చెప్పొచ్చు. సినిమా ట్రైలర్ విజువల్స్, గ్రాండియర్, స్టార్ కాస్ట్ అన్నింటికీ మించి మెగాస్టార్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచారు. ఇక ట్రైలర్ ఇలా రిలీజ్ చేశారో లేదో సోషల్ మీడియా లో….

ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది ఈ ట్రైలర్, ఇండియాలో రిలీజ్ చేసిన మూడో నిమిషమే ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన ఈ ట్రైలర్ టాప్ 3 ప్లేస్ తో మొదలు పెట్టి ఇప్పుడు 1 లక్షా 20 వేలకి పైగా ట్వీట్స్ తో…

టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తుండగా వరల్డ్ వైడ్ గా కేవలం 6 నిమిషాల్లోనే టాప్ 15 ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన ట్రైలర్ ఇప్పుడు టాప్ 7 ప్లేస్ లో చేరి ట్రెండ్ అవుతుంది. కాగా ఒక్క సైరాట్రైలర్ హాష్ టాగ్ పై 1 లక్షా 20 వేలకు పైగా ట్వీట్స్ పోల్ అవ్వగా…

మిగిలిన హాష్ టాగ్స్ అన్నీ కలిపి 2 లక్షలకు పైగా ట్వీట్స్ ఇప్పటి వరకు పోల్ అయ్యాయి. ఇది సీనియర్ హీరోల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పాలి. సినిమా పై క్రేజ్ ఓ రేంజ్ లో ఉండగా ట్రైలర్ కి నార్త్ ఆడియన్స్ నుండి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుండటం విశేషం.

ఇక ట్రైలర్ యూట్యూబ్ రికార్డుల వేట మొదలు పెట్టగా ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ మొత్తం మీద 24 గంటలు ముగిసే సరికి ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here