మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి పై ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే… అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ పై అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయి కానీ హిందీ లో మాత్రం సినిమా కి చాలా గట్టి పోటి ఉండేలా కనిపిస్తుంది. హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ ల కాంబో లో వస్తున్న వార్ సినిమా మంచి క్రేజ్ నడుమ రిలీజ్ కాబోతుంది.
కాగా ఈ సినిమా సైరా తో హిందీ లోనే కాదు సౌత్ లో ఇతర డబ్ వర్షన్స్ పరంగా కూడా పోటి ఇస్తుండటం తో ఆ సినిమా పై కూడా అందరి లోను ఆసక్తి పెరిగి పోయింది. ఇక సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ అలాగే ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కానుంది అన్న వివరాలు రిలీజ్ చేశారు.
కాగా సినిమాను టోటల్ గా 180 కోట్ల బడ్జెట్ లో రూపొందించగా పబ్లిసిటీ కోసం 20 కోట్లు ఖర్చు చేశారట. దాంతో టోటల్ బడ్జెట్ 200 కోట్లు అయ్యింది. ఇక శాటిలైట్ రైట్స్ అండ్ స్ట్రీమింగ్ రైట్స్ తో సినిమా కి 120 కోట్లు దక్కాయట. ఇక మ్యూజిక్ రైట్స్ తో 10 కోట్లు దక్కినట్లు సమాచారం.
దాంతో నాన్ థియేట్రికల్ వాల్యూ 130 కోట్లు వెనక్కి రాగా సినిమా ను ఇండియా మొత్తం మీద 110 కోట్ల రేటు కి అమ్మారట. దాంతో ఇండియా లో సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 210 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా ఇండియా మొత్తం మీద…
హిందీ వర్షన్ 4300 థియేటర్స్ లో ఇండియా లో రిలీజ్ అవుతుందట. తెలుగు తమిళ్ కలిపి 5200 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుందట. ఇక సైరా సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందో ఈ వార్ సినిమా ను పోటి ని హిందీ వర్షన్ వరకు ఎలా తట్టుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పొచ్చు.