మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు ఎక్కువ మంది ఉన్నారు, ఒక్కో హీరో కి కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇలా అందరి ఫ్యాన్స్ మనస్తత్వం ఒకలా ఉండదు కాబట్టి అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ అది చాలా వరకు హద్దులలోనే ఉంటూ రాగా, కొన్ని సార్లు మాత్రం అది విపరీతంగా పెరిగి పోతుంది.. ఇలాంటి ఎక్కువగా కోలివుడ్ ఇండస్ట్రీ లో జరిగుతూ రావడం ఇప్పటి వరకు జరిగింది.
అక్కడ విజయ్ మరియు అజిత్ ఫ్యాన్స్ పేరిట అనేక నెగటివ్ ట్రెండ్స్ జరిగాయి, ఇండియా వైడ్ గా ఇప్పటికీ కొన్ని సార్లు నీచమైన పదాలతో ట్రెండ్ చేశారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఈ అలవాటు పెంచుకుంటూ పోతుండటం విచారకరం అని చెప్పొచ్చు.
రీసెంట్ టైం లో మహేష్ బాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యి టాలీవుడ్ పరువు తీయగా అంతకుముందు ఇతర ఫ్యాన్స్ కూడా ఇలాంటి ట్రెండ్స్ ని చేశారు. ఫ్యామిలీస్ ని ఇన్వాల్వ్ చేస్తూ నీచంగా ట్రెండ్స్ చేశారు. ఇప్పుడు ఇండియా గర్వపడే సినిమా గా చెప్పుకుంటున్న….
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా లో నేషనల్ వైడ్ గా నెగటివ్ ట్రెండ్స్ తో టాలీవుడ్ పరువు తీస్తున్నారు… నిన్న మొత్తం 2 టాగ్ లు ఇండియా లో ట్రెండ్ అవుతూ వచ్చాయి… #FanBaseLessNTR మరియు #FanBaseLessRamCharan ఇలా రెండు టాగ్స్ ఇద్దరూ ట్రెండ్ చేశారు. కారణం ఏంటో కూడా ఎవ్వరికీ తెలియదు కానీ…
చిన్న చిన్న విషయాలకు ఇలా నీచంగా నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తూ ఫ్యాన్ వార్స్ గురించి అందరికీ తెలిసేలా టాలీవుడ్ పరువు పోయేలా చేస్తున్నారు. ఒక పక్క హీరోలు కలిసి టాలీవుడ్ గౌరవం పెంచుతుంటే… అభిమానులు కొందరు హీరోల పరువు నేషనల్ వైడ్ ట్రెండ్ తో తీయడమే కాదు టాలీవుడ్ గురించి కూడా అందరూ కామెంట్స్ చేసేలా చేస్తున్నారు. ఇది ఎప్పటికి ఆగుతుందో చూడాలి.