Home న్యూస్ టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లిస్టు ఇదే!!

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లిస్టు ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల పరంగా పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ఎప్పుడు ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో ఎవ్వరం చెప్పలేము…. కొన్ని సినిమాలు చిన్నవి అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేస్తూ ఉంటాయి, కొన్ని సినిమాలు పెద్దవి అయినా అప్పుడప్పుడు అంచనాలను తప్పుతూ ఉంటాయి. ప్రస్తుతానికి సీనియర్ హీరోలు, టాప్ హీరోలు కాకుండా టైర్ 2 స్టార్ హీరోల విషయానికి వస్తే.. రీసెంట్ టైం లో కొందరు హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ ని దుమ్ము దుమారం కూడా లేపారు….

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా తో టైర్ 2 హీరోల్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో 70 కోట్లకి పైగా షేర్ ని అందుకుని బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు. ఈ అద్బుతం జరిగి 5 ఏళ్ళు అయిపోయినా కానీ రికార్డ్ ఇప్పటికీ అలానే కొనసాగుతూ ఉండటం విశేషం…

విజయ్ దేవరకొండ కన్నా ముందే నితిన్ అ..ఆ సినిమా తో ఆల్ మోస్ట్ 50 కోట్లకు చేరువ అయ్యి దుమ్ము లేపాడు. ఇక 2023 లో నాని దసరా సినిమా తో 60 కోట్లతో సంచలనం సృష్టించాడు…సాయి ధరం తేజ్ కూడా విరూపాక్ష సినిమాతో సంచలన కలెక్షన్స్ ను నమోదు చేశాడు…. నిఖిల్ కార్తికేయ2 తో సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు…

మొత్తం మీద టైర్ 2 హీరోల కెరీర్ బెస్ట్ టాప్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే
1. విజయ్ దేవరకొండ(గీతగోవిందం): 70.5 కోట్లు
2. నాని (దసరా): 63.55 కోట్లు
3. నిఖిల్ సిద్దార్థ్(కార్తికేయ2) : 58.40 కోట్లు
4. నితిన్(అ.ఆ):49 కోట్లు++
5. వరుణ్ తేజ్(ఫిదా): 48.5 కోట్లు
6. సాయి ధరం తేజ్( విరూపాక్ష ): 48.20కోట్లు
7. రామ్(ఇస్మార్ట్ శంకర్): 40.56 కోట్లు
8. నాగ చైతన్య( మజిలి): 40.23 కోట్లు
9. నవీన్ పొలిశెట్టి(జాతిరత్నాలు): 38.52 కోట్లు
10. కళ్యాణ్ రామ్(బింబిసార) : 37.92 కోట్లు 

11. శర్వానంద్(శతమానం భవతి): 34 కోట్లు 
12. అడివి శేష్(మేజర్): 33.35 కోట్లు
13. రానా( ఘాజీ అటాక్): 27.10 కోట్లు
14. అఖిల్ అక్కినేని( మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ): 24.14 కోట్లు

ప్రస్తుతానికి ఇవి టైర్ 2 హీరోల సోలో టాప్ మూవీస్…  2024 ఇయర్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు సమ్మర్ నుండి ఇయర్ ఎండ్ వరకు వరుస పెట్టి రిలీజ్ కానున్నాయి. మరి వాటిలో ఏవైనా కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంటుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here