Home గాసిప్స్ 600 కోట్ల విజయ్ G.O.A.T మూవీ స్టోరీ పాయిట్ లీక్ అయిపోయిందిగా!!

600 కోట్ల విజయ్ G.O.A.T మూవీ స్టోరీ పాయిట్ లీక్ అయిపోయిందిగా!!

0

సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ అన్ని ఇండస్ట్రీలలో కూడా తన మార్కెట్ ను పెంచుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy vijay) లియో(Leo Movie) తో కెరీర్ లోనే కాదు కోలివుడ్ సినిమాల పరంగా కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ సినిమా తర్వాత…

వెంటనే మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు, నాగ చైతన్య(Naga Chaitanya) తో కస్టడీ సినిమా తీసి ఫ్లాఫ్ కొట్టిన కోలివుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ డబుల్ యాక్షన్ లో కొత్త సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమా అఫీషియల్ పోస్టర్స్ ను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్…

పోస్టర్స్ చూసిన తర్వాత సినిమా కథ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్తా ఇప్పుడు కోలివుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ప్రకారం సినిమా ఒరిజినల్ కథతో కాదు ఓ హాలివుడ్ మూవీ కథతో ఇక్కడ ఆడియన్స్ కి నచ్చే విధంగా రూపొందబోతుంది అంటున్నారు…

హాలివుడ్ లో 2019లో వచ్చిన జెమినీ మ్యాన్ అనే సినిమా కథ పాయింట్ ని పొలి ఉంటుందట. ఆ సినిమాలో కూడా ఇద్దరు ఒకేలా ఉండగా ఒకరిపై ఒకరు పోటీ పడుతూ గొడవ పడతారు, తర్వాత ఇద్దరు తండ్రి కొడుకులు అని తెలుస్తుంది. ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా…..

ఈ సినిమా కూడా ఆల్ మోస్ట్ అదే పాయింట్ తో ఇప్పుడు విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) ఉండబోతుందని టాక్ వస్తుంది, కానీ డైరెక్టర్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదట. దాంతో సినిమా వచ్చాక దీనిపై ఫుల్ క్లారిటీ వస్తుంది అంటున్నారు ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here