రెండు బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో…అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ఈ సినిమా నాగ చైతన్య కి సాలిడ్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది…
మూడు రోజుల వీకెండ్ లో వీర లెవల్ లో వీరంగం సృష్టించిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాని ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. సినిమా నైజాం ఏరియాలో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్….
10.50 కోట్ల రేంజ్ లో జరిగింది. సినిమా 3 రోజుల్లోనే నైజాం ఏరియాలో 10.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక 4వ రోజు సాధించిన కలెక్షన్స్ తో నైజాంలో బ్రేక్ ఈవెన్ ని దాటేసి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యింది అని చెప్పాలి. నైజాం లో నాగ చైతన్య నటించిన లాస్ట్ రెండు సినిమాలు అయిన…
థాంక్ యు మూవీ 1.24 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా తర్వాత వచ్చిన కస్టడీ మూవీ 1.88 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇప్పుడు తండేల్ మూవీ ఎక్స్ లెంట్ గా రచ్చ చేస్తూ ఈ ఏరియాలో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది…. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా…
ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ ను సొంతం చేసుకున్న సినిమా వీక్ లోపే ఓవరాల్ గా సూపర్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. రెండు వరుస ఫ్లాఫ్స్ తర్వాత సూపర్బ్ లాభాలతో నాగ చైతన్య ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి….