బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ ఊచకోత కోస్తున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా, వాలెంటైన్స్ వీకెండ్ లో కొత్త అలాగే రీ రిలీజ్ సినిమాలు భారీగా రిలీజ్ అవ్వగా ఏవి కూడా ఇప్పుడు…
తండేల్ సినిమా జాతరను ఆపలేక పోయాయి….శుక్రవారం రోజే తండేల్ లీడ్ ను అన్ని సినిమాల మీద చూపించడం మొదలు పెట్టగా…శనివారం ఎక్స్ లెంట్ టికెట్ సేల్స్ తో అన్ని సినిమాలను సైతం డామినేట్ చేసి మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు… 9వ రోజు లో ఉన్న తండేల్ మూవీ…
టికెట్ సేల్స్ లో మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా ఇతర సినిమాలు ఏవి చూపించ లేక పోయాయి…కొత్త సినిమా లైలా 2వ రోజున కేవలం 7 వేల లోపే టికెట్ సేల్స్ ను అందుకోగా మరో కొత్త సినిమా బ్రహ్మానందం 8 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకుంది… రీ రిలీజ్ అయిన ఆరెంజ్ మూవీ 7.5 వేల టికెట్ సేల్స్ ను..
సొంతం చేసుకుని కుమ్మేసింది…ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా 5.5 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది.కానీ అదే టైంలో తండేల్ మూవీ మాత్రం ఎక్స్ అన్ని సినిమాల మీద డబుల్ రేంజ్ లో మాస్ రాంపెజ్ ను చూపించి 53 వేల లోపు టికెట్ సేల్స్ తో ఓ రేంజ్ లో కుమ్మేసింది…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న తండేల్ మూవీ ఈ సండే రోజున కూడా మరోసారి అన్ని చోట్లా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇదే ఊపుని ఈ నెల ఎండ్ వరకు కొనసాగిస్తే సాలిడ్ లాభాలతో తండేల్ మాస్ ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు.