బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊహకందని ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా వీకెండ్ లో వీర లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ప్రతీ రోజూ అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయింది…
3వ రోజున అయితే సినిమా ఏకంగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి…. 4 ఏళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు యూత్ లో ఓ రేంజ్ లో అంచనాలను క్రియేట్ చేసిన ఉప్పెన మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….ఆ సినిమా మూడో రోజు నెలకొల్పిన 8.26 కోట్ల షేర్ రికార్డ్ ను తర్వాత క్రేజీ మీడియం రేంజ్ మూవీస్ బ్రేక్ చేయాలని ట్రై చేసినా కూడా ఏ సినిమా వల్ల కూడా కాలేదు, కానీ ఇప్పుడు ఎట్టకేలకు తండేల్ మూవీ మూడో రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా…
మించి పోయి 4 ఏళ్ల క్రితం ఉప్పెన మూవీ నెలకొల్పిన డే 3 రికార్డ్ ను బ్రేక్ చేసి 8.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసి కొత్త రికార్డ్ ను అప్ కమింగ్ మీడియం రేంజ్ మూవీస్ కి సెట్ చేసింది. ఒకసారి 3వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే….
Day 3 AP-TG Top collections for Medium Range Movies
👉#Thandel- 8.40Cr*******
👉#Uppena – 8.26Cr
👉#TilluSquare – 7.44Cr
👉#DASARA – 6.73Cr
👉#Virupaksha – 5.77CR
👉#HanuMan- 5.70CR
👉#Kushi- 5.68Cr
👉#LoveStory- 5.19Cr
👉#Bimbisara- 5.02CR
👉#SaripodhaaSanivaaram – 4.68CR
👉#iSmartShankar: 4.32Cr
👉#Bheeshma: 4.31Cr
ఓవరాల్ గా మూడో రోజు తండేల్ మూవీ ఉప్పెన ఎపిక్ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా నాగ చైతన్య బాక్ టు బాక్ డిసాస్టర్స్ తర్వాత ఊహకందని కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో తండేల్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో ఊచకోత కోస్తుందో చూడాలి ఇప్పుడు….