Home గాసిప్స్ అదొక్కటి మిస్….పని మొదలు పెట్టిన యంగ్ టైగర్!

అదొక్కటి మిస్….పని మొదలు పెట్టిన యంగ్ టైగర్!

0

      టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఉగాది కానుకగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ కానీ… తర్వాత రామ్ చరణ్ పుట్టిన రోజున రిలీజ్ అయిన రామరాజు ఇంట్రో టీసర్ కానీ సినిమా పై ఉన్న…

అంచనాలను భారీ ఎత్తున పెంచేశాయి. ఇక భీమ్ ఫర్ రామరాజు టీసర్ కి ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా ఓ రేంజ్ లో ప్లస్ అయింది. తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో ఓన్ గా వాయిస్ ఓవర్ ఇచ్చి మెప్పించాడు ఎన్టీఆర్.

అన్ని చోట్లా రెస్పాన్స్ అదిరిపోయే రేంజ్ లో రాగా ఒక్క భాషలో మాత్రం వేరే యాక్టర్ తో డబ్ చేశారు, అదే మలయాళంలో… మలయాళ భాష కొద్దిగా కష్టమైన భాష అవ్వడం తో టీసర్ కి అది పక్కన పెట్టేశారు కానీ ఎన్టీఆర్ అదొక్కటి మిస్ అయిందన్న భావన తో….

ఇప్పుడు మళయాళ భాష నేర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడని తెలుస్తుంది, తెలుగు కన్నడ అనర్గళంగా మాట్లాడే ఎన్టీఆర్ తమిళ్ కూడా ఈజీ గా మాట్లాడాడు, ఇక హిందీ కూడా బాగానే మెప్పించాడు. ఇక ఇప్పుడు మిగిలిన మలయాళం కూడా నేర్చుకుని ఆర్ ఆర్ ఆర్ సినిమా కి గాను తన పాత్ర అన్ని భాషలకు కలిపి తానె…

డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు మలయాళం నేర్చుకునే పనిలో ఫుల్ బిజీ గా ఉన్నాడని అంటున్నారు. మలయాళం నేర్చుకోవడానికి జనతా గ్యారేజ్ లో తనతో నటించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ హెల్ప్ అప్పుడప్పుడు తీసుకుంటున్నాడే టాక్ ఉంది.. దాంతో ఆర్ ఆర్ ఆర్ కి అన్ని భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం ఆల్ మోస్ట్ కన్ఫాం అనే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here