Home న్యూస్ కలిసి రాలేదు అని వదిలేశారు…30 కోట్లు పిండుకున్నారు!!

కలిసి రాలేదు అని వదిలేశారు…30 కోట్లు పిండుకున్నారు!!

0

     టాలీవుడ్ లో ఒక్కో సారి కొన్ని సీజన్స్ ని ఊరికే వదిలేస్తూ ఉంటారు, కొందరు సెంటిమెంట్ అనుకుంటారు, కొందరు అన్ సీజన్ అనుకుంటారు… ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో థియరీ ఉంటుంది, రీసెంట్ టైం లో మన హీరోలు అవైడ్ చేసిన సీజన్ లో ముందు చెప్పుకోవాల్సిన సీజన్ దీపావళి…. గత కొంత కాలంగా దీపావళి సీజన్ ని మన హీరోలు పెద్దగా పట్టించుకోవడం లేదు. 2015 లో అఖిల్ లాంచింగ్ మూవీ అఖిల్ మాత్రమె దీపావళి కి రిలీజ్ అయింది.

రిజల్ట్ తేడా కొట్టడం తో తర్వాత నుండి ఎందుకనో దీపావళి కి ఇక్కడ సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు.. 2017 నుండి అసలు దీపావళి టైం లో పేరున్న స్టార్స్ నటించిన సినిమా లు కూడా రిలీజ్ అవ్వడం లేదు. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకున్న కోలివుడ్ హీరోలు ఆ సీజన్ నే టార్గెట్ చేస్తున్నారు.

లాస్ట్ ఇయర్ తెలుగు లో అప్పుడప్పుడే మార్కెట్ ని ఏర్పాటు చేసుకుంటున్న విజయ్ కి దీపావళి సీజన్ ఇక్కడ ఇచ్చేయగా సర్కార్ సినిమా తో 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. ఇక ఈ ఇయర్ తెలుగు సినిమా లు మరోసారి వెనకడుగు వేయడం తో… ఇద్దరు హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసి దుమ్ము లేపుతున్నారు.

విజయ్ నటించిన విజిల్ ఇక్కడ ఇప్పటికే ఆల్ మోస్ట్ 11 కోట్ల రేంజ్ లో షేర్ ని 19 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుని దుమ్ము దుమారం చేసింది. ఇక కార్తీ ఖైదీ అంచనాలు లేకుండా వచ్చి ఇప్పటికే 7 కోట్ల దాకా షేర్ ని…. 12 కోట్ల దాకా గ్రాస్ ని రాబట్టాయి. రెండు సినిమాలు కలిపి ఆల్ మోస్ట్ 18 కోట్ల షేర్ ని 30 కోట్లకు పైగా గ్రాస్ ని రెండు రాష్ట్రాల లోనే పిండుకున్నాయి.

అవి 2 డబ్బింగ్ మూవీస్ అయినా 30 కోట్లు రెండు రాష్ట్రాల నుండే గ్రాస్ రూపంలో రావడం విశేషం అనే చెప్పాలి. మన స్ట్రైట్ మూవీస్ రిలీజ్ చేసి ఉంటె ఓవర్సీస్ కర్ణాటక అన్ని కలిపి 25 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే రేంజ్ అది… మరి వచ్చే దీపావళిని అయినా మన హీరోలు వాడుకుంటారో లేక మళ్ళీ డబ్బింగ్ మూవీస్ కే రాసి ఇస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here