Home న్యూస్ 8 కోట్ల రేటుకి నో చెబితే…ఇప్పుడు దెబ్బ పడిందిగా!

8 కోట్ల రేటుకి నో చెబితే…ఇప్పుడు దెబ్బ పడిందిగా!

0

కొన్ని కొన్ని సార్లు సరైన టైం లో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాలను చూస్తె… కొన్ని సినిమాలు మాత్రమె అంచనాలను మించి ఆకట్టుకున్నాయి. చాలా వరకు సినిమాల కంటెంట్ లు యావరేజ్ గానే ఉండటం తో సినిమా మేకర్స్ సినిమా కంటెంట్ మీద డౌట్ ఉండటం వలెనే సినిమాను తెలివిగా డిజిటల్ లో రిలీజ్ చేసుకుని….

ఒకేసారి పెద్ద అమౌంట్ తో సేఫ్ అయ్యారు… కానీ కొందరు మాత్రం తమ కంటెంట్ ని అంచనా వేయలేక మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేటెస్ట్ గా థియేటర్స్ లో సెకెండ్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన తేజ సజ్జ నటించిన ఇష్క్ సినిమా…

మలయాళ హిట్ మూవీ కి రీమేక్ గా రావడం తో తెలుగు లో కూడా ఆకట్టుకునే అవకాశం ఉందని అంతా అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కంప్లీట్ గా రివర్స్ లో వచ్చింది, దానికి తోడూ కలెక్షన్స్ కూడా ఏమాత్రం సినిమా బిజినెస్ ను అందుకునే…

దిశగా వెళ్ళడం లేదు… కానీ ఈ సినిమా కి ఓ నెలన్నర క్రితం డైరెక్ట్ రిలీజ్ కోసం అల్టిమేట్ ఆఫర్స్ వచ్చాయి. సినిమా బడ్జెట్ కి రెండున్నర రెట్ల రేటు ఆఫర్ వచ్చినా మేకర్స్ మాత్రం సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆల్ మోస్ట్ 8 కోట్ల రేంజ్ రేటు ని సినిమా సొంతం చేసుకోగా వద్దూ అనుకుంటే ఇప్పుడు థియేటర్స్ లో….

2.5 కోట్ల బిజినెస్ నే సాధించినా ఆ బిజినెస్ ను కూడా ఇప్పుడు రికవరీ చేయడం అసాధ్యంగా కనిపిస్తుంది ఇప్పుడు.. దాంతో అప్పుడు ఆ ఆఫర్ ని ఓకే చేసి ఉంటే మంచి లాభాలు మేకర్స్ కి దక్కి ఉండేవని ఇప్పుడు నో చెప్పడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుదెబ్బ తగిలిందని అంతా అనుకుంటున్నారు. మరి సినిమా లాంగ్ రన్ లో ఏమైనా జోరు చూపుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here