Home గాసిప్స్ తూచ్ అవన్నీ అబద్దాలే!!

తూచ్ అవన్నీ అబద్దాలే!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫాం లో ఉన్నా కానీ స్పీడ్ తగ్గించాడు… రెండేళ్ళ క్రితం వరకు వరుస సినిమాలతో ఫుల్ జోష్ తో ఫ్యాన్స్ కి వరుసగా కిక్ ఇచ్చే సినిమాలు చేస్తూ వచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు రెండేళ్ళ కి పైగా టైం లో ఒక్క సినిమా కోసమే కేటాయించాడు. కానీ ఒక్క సినిమా ఓ 5 సినిమాలకు ఏమాత్రం తక్కువ కాదని చెప్పొచ్చు కానీ ఫ్యాన్స్ మాత్రం…

ఈ రెండేళ్ళ గ్యాప్ లో ఎన్టీఆర్ కూడా ఈజీగా 4 నుండి 5 సినిమాలు చేసి ఉండేవాడు అని అనుకుంటారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా డిలే మీద డిలే అవుతూ ఇప్పుడు వచ్చే ఇయర్ సమ్మర్ రేసు లో నిలిచిన విషయం తెలిసిందే… ఈ స్నిమా తర్వాతే…

ఎన్టీఆర్ మిగిలిన సినిమాలు చేయబోతున్నాడు. ఇక గురించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టగా అవన్నీ అబద్దం అని తేలాయి. ఎన్టీఆర్ ఒక టీవీ ఛానల్ పెట్టబోతున్నారని… ఆ ఛానెల్ ఎన్టీఆర్ భార్య ప్రణీత గారు మెయిన్ టైన్ చేయబోతున్నారని వార్తలు ఓ రెండు రోజు బాగా చక్కర్లు కొట్టింది.

ఎన్టీఆర్ మామగారు టీవీ చానెల్ వాళ్ళే కాబట్టి ఎన్టీఆర్ కూడా టీవీ చానెల్ పెట్టబోతున్నారని కొంతమంది నమ్మరు కూడా… కానీ ఎన్టీఆర్ మానేజర్ కోనేరు నుండి అఫీషియల్ గా అప్ డేట్ వచ్చింది. అవన్నీ అబద్దాలే అని ఎలాంటి నిజం లేదని క్లియర్ గా తెలియజేశారు. దాంతో టీవీ చానెల్ రూమర్ మాత్రమె అని క్రిస్టల్ క్లియర్ గా తెలిపోయింది.

ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమాలు కూడా సాలిడ్ గా ఉన్నాయని చెప్పొచ్చు, త్రివిక్రమ్ తో ఒక సినిమా, కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు ఎన్టీఆర్… ఇవీ కూడా పాన్ ఇండియా మూవీస్ అనే అంటున్నారు ప్రస్తుతానికి. ఇందులో ఎన్టీఆర్ 30 వ సినిమా దసరా కి మొదలు కాబోతుందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here