టికెట్ హైక్స్ రీసెంట్ టైం లో చాలా సినిమాలకు ఇదే ప్లస్ పాయింట్ అలాగే ఇదే మైనస్ పాయింట్… సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు టికెట్ రేట్స్ ఎలా ఉన్నా జనాలు చూడటానికి వస్తారు కానీ టాక్ కనుక తేడా కొడితే ఆ రేట్స్ ని చూసి థియేటర్స్ కి వచ్చే జనాలు కూడా వెనక్కి వెళ్ళిపోవడం రీసెంట్ టైం లో ఎక్కువగా జరుగుతుంది, లాస్ట్ ఇయర్ ఆంధ్రలో టికెట్ రేట్స్ ని తగ్గించడంతో పెంచాలి అంటూ అనేక చర్చలు చేసిన తర్వాత…
రీసెంట్ గా రేట్స్ ని పెంచగా ఆర్ ఆర్ ఆర్ మరియు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాలు తప్పితే ఫస్ట్ డే నే ఇతర బిగ్ మూవీస్ కి అనుకున్న రేంజ్ ఫుల్స్ పడలేదు, ఇక ఫస్ట్ వర్కింగ్ డే కి వచ్చేసరికి ఆర్ ఆర్ ఆర్ మరియు కేజిఎఫ్ చాప్టర్ 2 కి కూడా ఆక్యుపెన్సీ అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా తగ్గింది…
ఆల్ రెడీ ఈ రేట్స్ వలన ఓపెనింగ్ డే కే హౌస్ ఫుల్స్ లేక సోషల్ మీడియాలో ట్రోల్ స్టఫ్ గా మారుతుంటే వర్కింగ్ డేస్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ పడుతున్నాయి… వీకెండ్ వరకు టికెట్ హైక్స్ ఓకే కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి కూడా అదే రేట్స్ పెట్టడం గట్టిగానే బాక్ ఫైర్ అవుతుంది, అందుకే ఇప్పుడు మరోసారి టికెట్ హైక్స్ పై ఇండస్ట్రీలో చర్చలు జరగబోతున్నాయి. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.