బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ లాస్ట్ ఇయర్ ఎండ్ లో ధమాకా(Dhamaka) మూవీతో సాలిడ్ హిట్ కొట్టినా ఈ ఇయర్ సమ్మర్ లో రావణాసుర(Ravanasura) సినిమాతో నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉన్నాడు…
ఈ సినిమా ఆడియన్స్ ముందుకు అక్టోబర్ 20న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఆల్ రెడీ మంచి బజ్ అయితే ఉందని చెప్పాలి. ఇక సినిమా బిజినెస్ పరంగా రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా కుమ్మేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
రావణాసుర సినిమా ఫ్లాఫ్ అయినా కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమా మాత్రం సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇతర భాషల్లో ఓన్ గానే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 37.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది.
ఏరియాల వారి బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
#TigerNageswaraRao WW Valued Business
👉Nizam: 8.60Cr
👉Ceeded: 5.40Cr
👉Andhra: 17CR
AP-TG Total:- 31.00CR
👉KA+ROI: 4Cr
👉OS – 3Cr
Total WW: 37.50CR( Break Even – 38.50CR~)
మొత్తం మీద సినిమా హిట్ అవ్వాలి అంటే ఏకంగా 38.50 కోట్ల రేంజ్ లో షేర్ ని భారీ పోటిని తట్టుకుని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా కి ఉన్న పాజిటివ్ బజ్ దృశ్యా టాక్ బాగుంటే మంచి లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు. మరి రవితేజ ఈ సినిమాతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.