ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం ఒకప్పుడు కష్టంగా మారినా బాహుబలి రాకతో టాలీవుడ్ మూవీస్ లో ఈ ఫీట్ ని అందుకోవడం ఈజీ అయింది అని చెప్పొచ్చు. బాహుబలి సిరిస్ ని పక్కకు పెడితే మిగిలిన హీరోల లో ఒక ఇయర్ లో 100 కోట్ల షేర్ ని క్రాస్ చేసిన టోటల్ హీరోల ను గమనిస్తే…ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016 ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర…
నాన్నకుప్రేమతో మరియు జనతా గ్యారేజ్ సినిమాలతో 100 కోట్ల మార్క్ ని అందుకున్నాడు, అదే ఇయర్ లో కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి సినిమాలతో 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు. ఇక 2017 ఇయర్ లో మెగాస్టార్ చిరంజీవి…
ఖైదీ నంబర్ 150 తో ఈ మార్క్ ని అందుకున్నాడు, ఇదే ఇయర్ లో నాని మూడు సినిమాలతో 100 కోట్ల మార్క్ ని అధిగమించగా… 2018 ఇయర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా తోనూ, మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా తోనూ 100 కోట్ల హీరోలుగా మారారు.
ఇక ఇప్పుడు ఇదే ఇయర్ లో విజయ్ దేవరకొండ కూడా 100 కోట్ల హీరోగా మారాడు, మూడు స్ట్రైట్ సినిమాలతో 100 కోట్ల షేర్ ని అధిగమించిన విజయ్ దేవరకొండ టాలివుడ్ లో 100 కోట్ల షేర్ ని ఒక ఇయర్ లో అందుకున్న హీరోల సరసన చేరాడు.
వచ్చే ఏడాది మన హీరోలు నటించిన క్రేజీ సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్న నేపధ్యంలో మరిన్ని 100 కోట్ల సినిమాలతో టాలివుడ్ హీరోలు దుమ్ము లేపాలని కోరుకుందాం. ఈ హీరోలలో మీ ఫేవరేట్ హీరోలు ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
Ntr
Viyay devarakonda dhi 100 cr cinema yedhi vundhi
3 movies bro… GG 70cr, Taxiwala 21cr+, Nota 12cr…total 100cr plus
Power star
NTR is my favorite
SSMB