తెలుగు సినిమాల మార్కెట్ ఒక్కసారిగా మారిపోయింది…బాహుబలి సిరీస్ తో మార్కెట్ డబుల్ ట్రిబుల్ అవ్వగా ఇప్పుడు మిగిలిన హీరోలు ఆ మార్కెట్ ని వాడుకుంటూ తమ సినిమాల రేంజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. కాగా కలెక్షన్స్ విషయంలో ఈ ప్రభావం బాగానే కనిపిస్తుండగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మాత్రం పీక్స్ లో ఎఫెక్ట్ ఉందని చెప్పొచ్చు. ఒక్కసారి ఈ మధ్యకాలంలో కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు ఏవో లుక్కేద్దాం పదండీ…
- బాహుబలి 2—-180 కోట్లు
- పవన్ కళ్యాణ్ 25—-92.3 కోట్లు
- స్పైడర్—–80 కోట్లు
- ఖైదీనంబర్150—–76 కోట్లు
- భరత్ అనే నేను—–72 కోట్లు
- జైలవకుశ—-67 కోట్లు
- రంగస్థలం—-62 కోట్లు
ఇవి ప్రస్తుతానికి టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించిన సినిమాలు…ఈ లిస్టులో ఉన్న సినిమాలలో బాహుబలి మరియు ఖైదీనంబర్ 150 సినిమాలు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ ని క్రాస్ చేయడమో లేదా క్లోజ్ గా వెళ్లడమో చేశాయి…కొన్ని సినిమాలు నష్టాలను మిగిలించగా మరికొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ కి చేరువగా వచ్చాయి…ఇక అరవింద సమేత, RC12, మహేశ్25, చిరు సైరా, సాహో ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ కానున్నాయి…వాటిలో త్వరలోనే ఈ లిస్టులో మరిన్ని మార్పులు వచ్చే అవకాశముంది..