హైర్స్ అంటే ఒక ఏరియాని గంపగుత్తుగా కొంటారు…ఆ ఏరియాలో ఇక ఎంత కలెక్షన్స్ వచ్చినా అతనికే సొంతం అవుతుంది. కానీ ఆ హైర్స్ కలెక్షన్స్ ని మాత్రం ఆయా సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ లో కానీ, వీకెండ్ లేదా మొదటి వారం ఎండ్ అయ్యే టైం లో కలిపి అనౌన్స్ చేస్తారు…చాలా వరకు పెద్ద సినిమాలకు ఈ హైర్స్ కలెక్షన్స్ ని…
మొదటి రోజు రికార్డుల పరంగా కలిపి అప్ డేట్ చేస్తూ ఉంటారు, కొన్ని సినిమాలకు సీజన్ ను బట్టి డిమాండ్ ను బట్టి భారీ హైర్స్ సొంతం అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలకు మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని నమోదు చేయడానికి ఈ హైర్స్ బాగానే హెల్ప్ అవుతాయి అని చెప్పాలి…
టాలీవుడ్ లో మొదటి రోజు హైయెస్ట్ హైర్స్ ను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే…
👉#RRRMOVIE – 15.44Cr
👉#SyeRaa – 14.03Cr
👉#Acharya – 10.81Cr
👉#BAAHUBALI2 – 10.80Cr
👉#VinayaVidheyaRama – 10.8cr~
👉#Agnyaathavaasi -8.2cr~
👉#SarileruNeekevvaru – 8.02Cr
👉#SarkaruVaariPaata – 8.01CR
👉#Saaho-7.25Cr
ఈ సినిమాలకు మొదటి రోజు సాలిడ్ గా హైర్స్ సొంతం అయ్యాయి. ఈ మధ్య హైర్స్ ఎందుకో అనుకున్న రేంజ్ లో సొంతం అవ్వడం లేదు, సలార్ కి కూడా 4 కోట్ల లోపే హైర్స్ దక్కాయి… దాంతో ఇది వరకటితో పోల్చితే చాలా తక్కువగా హైర్స్ సినిమాలకు సొంతం అవుతున్నాయి. ఇక ఫ్యూచర్ లో ఈ రికార్డ్ హైర్స్ ను బ్రేక్ చేసే రేంజ్ సినిమాలు ఏమైనా వస్తాయో చూడాలి.