కన్నడ టాప్ స్టార్స్ లో ఒకరైన రాకింగ్ స్టార్ యష్(Rocking Star Yash) కేజిఎఫ్ సిరీస్ తో ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేజిఎఫ్ చాప్టర్ 2 వచ్చి ఆల్ మోస్ట్ 3 ఏళ్ల టైం అవుతున్నా కొత్త సినిమా ఏమి ఆడియన్స్ ముందుకు తీసుకు రాని యష్ ఇప్పుడు ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు…
తన కొత్త సినిమా టాక్సిక్ ని తీసుకు రాబోతున్నాడు….గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండగా…రీసెంట్ గా యష్ పుట్టిన రోజు కానుకగా సినిమా నుండి అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా….
గ్లిమ్స్ మరీ అంచనాలను అందుకోలేక పోయినా కూడా చాలా టైం తర్వాత మళ్ళీ యష్ కనిపించిన తీరు గ్లిమ్స్ లో సినిమా మీద అంచనాలను అయితే పెంచింది అని చెప్పాలి. ఇక గ్లిమ్స్ 24 గంటల్లో కన్నడ రికార్డులనే కాదు ఏకంగా ఇండియన్ మూవీస్ పరంగా…
గ్లిమ్స్ లో ఆల్ టైం రికార్డులను వ్యూస్ పరంగా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. 24 గంటల్లో ఓవరాల్ గా 36 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకున్న ఈ గ్లిమ్స్ లైక్స్ పరంగా 550K లైక్స్ మార్క్ ని దాటేసి సంచలన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.
లైక్స్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వలేదు కానీ వ్యూస్ పరంగా మాత్రం ఆల్ టైం ఇండియన్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇది వరకు రికార్డ్ పుష్ప2 గ్లిమ్స్ పేరిట ఉండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను ఈ గ్లిమ్స్ బ్రేక్ చేసింది. ఒకసారి ఇండియన్ మూవీస్ లో…
ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న గ్లిమ్స్ ను గమనిస్తే…
India’s Most Viewed Glimpse in 24 Hours(1 channel)
👉#TOXIC – 36M~********
👉#WhereisPushpa(Hindi) – 27.67M
👉#Devara – 26.17M
👉#GunturKaaram – 20.98M
👉#Kanguva – 20.77M
👉#WhereisPushpa-(Telugu) – 20.45M
👉#Devara(Hindi) – 18.57M
ఓవరాల్ గా సాలిడ్ రికార్డులతో సినిమా మీద అంచనాలను పెంచేసిన టాక్సిక్ సినిమా ఈ ఏడాది క్రిస్టమస్ టైంలో ఆడియన్స్ ముందుకు వస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో యష్ కేజిఎఫ్ సిరీస్ తో వచ్చిన స్టార్ డం ని నిరూపించుకుని ఏ రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటాడో చూడాలి.