Home గాసిప్స్ ఉప్పెన షాకింగ్ క్లైమాక్స్…2 సెట్ చేశారట మరి…ఏమవుతుందో!

ఉప్పెన షాకింగ్ క్లైమాక్స్…2 సెట్ చేశారట మరి…ఏమవుతుందో!

0

రీసెంట్ టైం లో సాంగ్స్ అండ్ టీసర్ తో మంచి హైప్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఉప్పెన సినిమా కూడా ఒకటి. లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోగా సినిమా కి డిజిటల్ రిలీజ్ కోసం సాలిడ్ గా ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా హీరో ఫస్ట్ మూవీ అవ్వడం తో థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ సినిమాను ఆ విధంగానే ప్లాన్ చేస్తూ వచ్చారు.

ఎట్టకేలకు సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా లాంచ్ చేసి సినిమా పై మరింత క్రేజ్ పెరిగేలా చేయగా సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 5 న కానీ 12 న కానీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఇక సినిమా గురించిన ఒక న్యూస్ ఇది వరకు నుండే ట్రెండ్ అవుతున్న…

విషయం అందరికీ తెలిసిందే. సినిమా క్లైమాక్స్ చాలా షాకింగ్ గా ఉంటుందని, రెగ్యులర్ గా ఇలాంటి మూవీస్ లో ఉండేలా కాకుండా షాకింగ్ ఎలిమెంట్ తో కూడుకుని ఉంటుంది అని అంటుండగా, అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియక యూనిట్ సినిమా క్లైమాక్స్ పై…

మొత్తం మీద 2 సీన్స్ ని షూట్ చేశారట. ఆ రెండు సీన్స్ ని ఇండస్ట్రీలో చాలా క్లోస్ మెంబర్స్ కి చూపెట్టి రెండింటిలో ఏది బాగుందో అది సినిమాలో యాడ్ చేస్తారని అంటున్నారు. ఒకటి కంప్లీట్ షాకింగ్ గా ఉంటుందని, మరొకటి నార్మల్ గా మూవీస్ లో ఉండేలా సీన్స్ ని చిత్రీకరించారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉండగా సినిమా క్లైమాక్స్ పై మొదటి నుండి కూడా…

హైప్ ఎక్కువగా ఉందని చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన కలర్ ఫోటో సినిమా మాదిరిగానే ఈ సినిమా ఉంటుంది అని టాక్ వస్తుండగా క్లైమాక్స్ విషయం లో మాత్రం సుకుమార్ రేంజ్ ట్విస్ట్ తో షాక్ ఇవ్వబోతుందని కన్ఫాం చేస్తున్నారు. మరి 2 క్లైమాక్స్ లో ఏది ఫైనల్ అవుతుందో ఫిబ్రవరి లో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here