Home గాసిప్స్ ఎన్టీఆర్ కి జైలవకుష…కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా నట!

ఎన్టీఆర్ కి జైలవకుష…కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా నట!

896
0

టాలీవుడ్ లో ఈ జనరేషన్ హీరోలలో డబుల్ రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ హీరోలలో ట్రిపుల్ రోల్ చేసింది మాత్రం ఎన్టీఆర్ అనే చెప్పాలి, జై లవ కుశ సినిమా లో మూడు డిఫెరెంట్ రోల్స్ ని చేసి మూడు రోల్స్ తో కూడా మెప్పించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ జనరేషన్ హీరోలలో ఈ ఘనత సొంతం చేసుకున్న హీరోగా నిలిచాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఇలాంటి రేర్ ఫీట్ ను సొంతం చేసుకోవడానికి…

సిద్ధం అవుతున్నాడు కళ్యాణ్ రామ్… ఎన్టీఆర్ తో జై లవ కుశ నిర్మించిన కళ్యాణ్ రామ్ మూడు డిఫెరెంట్ రోల్స్ పై ఆసక్తి పెంచుకున్నాడో లేదా సడెన్ గా అలాంటి స్క్రిప్ట్ దొరికిందో తెలియదు కానీ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ లో మూడు డిఫెరెంట్ రోల్స్ తో…

కనిపించడానికి సిద్ధం అవుతున్నాడట. లాస్ట్ ఇయర్ ఎంత మంచి వాడవురా సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయిన కళ్యాణ్ రామ్ తర్వాత కొత్త సినిమా ను మొదలు పెట్టలేదు… కరోనా కూడా ఎంటర్ అవ్వడం తో ఫ్రీ టైం దొరికింది కళ్యాణ్ రామ్ కి…

కానీ ఇప్పుడు రెట్టించిన జోరు లో వరుస సినిమాలను ఒప్పుకుంటున్న కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా ఓ కొత్త సినిమాను కమిట్ అయ్యాడట… రవీందర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చి ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పగా… టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుండటం తో సినిమా పై మంచి హైప్ ఇప్పటి నుండే వస్తుంది అని చెప్పాలి.

కెరీర్ లో ఇది వరకు డిఫెరెంట్ మూవీస్ ని ట్రై చేసిన కళ్యాణ్ రామ్ మళ్ళీ ఇప్పుడు అలాంటి డిఫెరెంట్ టైప్ మూవీస్ ని చేయాలనీ ఫిక్స్ అవ్వగా అందులో భాగంగా ఈ 3 రోల్స్ ఉన్న మూవీ ని మొదలు పెట్టాలని చూస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ అప్ డేట్ ఈ సినిమా పై రాబోతుందని సమాచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here