2021 ఫిబ్రవరిలో సడెన్ గా మోస్ట్ వాంటెడ్ మూవీగా మారి సాలిడ్ క్రేజ్ నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఉప్పెన… ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి 12 న రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుండగా సినిమా సెన్సార్ పనులను రీసెంట్ గా పూర్తీ చేసుకుంది, యు/ఏ సర్టిఫికేట్ తో సినిమా రెండు గంటల 27 నిమిషాల రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా…
సినిమా సెన్సార్ నుండి ఫైనల్ గా టాక్ ఏంటో బయటికి వచ్చేసింది, ఆ టాక్ ప్రకారం సినిమా కచ్చితంగా అంచనాలను అందుకునే రేంజ్ లో ఉంటుంది అని అంటున్నారు. కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా ట్రైలర్ లో చూపెట్టినట్లే… పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి…
లవ్ లో పడటం ఆ విషయం తెలిసిన విలన్ తన విలనిజంతో ముందు విడగొట్టాలని ట్రై చేసినా ప్రేమ జంట వినక పోవడంతో ఎం చేశాడు అన్నది మెయిన్ ట్విస్ట్ అని అంటున్నారు. ఆ తర్వాత కథ ఎలా టర్న్ తీసుకుంది లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని అంటున్నారు.
ఆల్ మోస్ట్ ట్రైలర్ లో కూడా ఇదే చూపెట్టారు… ఫస్టాఫ్ కొంచం కథ సెటిల్ అవ్వడానికి టైం పట్టినా ఈ లోపు సాంగ్స్ మ్యాజిక్ తో పెద్దగా బోర్ ఫీల్ అయ్యే చాన్స్ ఉండదు అని అంటున్నారు, ఇంటర్వెల్ ట్విస్ట్ మెప్పిస్తుందని, సెకెండ్ ఆఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో బయట చెప్పుకుంటున్న మోస్ట్ షాకింగ్ ట్విస్ట్ వస్తుందని, తర్వాత క్లైమాక్స్ ఎలా ఎండ్ అయ్యింది అన్నది మరో ట్విస్ట్ అని అంటున్నారు…
ఓవరాల్ గా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీలో ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని క్లైమాక్స్ ట్విస్ట్ తో సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్, విజయ్ సేతుపతి సినిమా కి కీలక పిల్లర్స్ అని, కొత్త యాక్టర్స్ అయిన హీరో హీరోయిన్స్ కూడా బాగానే మెప్పించారని అంటున్నారు. మరి ఈ టాక్ కనుక రిలీజ్ అయ్యాక నిజం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఉప్పెన సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.