వి ది మూవీ డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుని ఇతర సినిమాలు కూడా అదే రూట్ ని ఫాలో అయ్యేలా రూట్ వేసినప్పటి కీ డిజిటల్ రిలీజ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇది వరకు సినిమాల కోసం ఎదురు చూసి రేట్లు పెంచేసిన OTT యాప్స్ ఇప్పుడు తమకి నచ్చి రేట్లని ఒక్కో సినిమా కి చెబుతున్నాయి అన్నది రీసెట్ మూవీస్ ఆఫర్స్ చేంజ్ ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
ఆ లిస్టు లో మొదటి నుండి థియేటర్స్ లోనే రిలీజ్ అంటూ వచ్చిన ఉప్పెన సినిమా కూడా ఒకటి, సినిమా ను లాభమో నష్టమో హీరో మొదటి సినిమా కాబట్టి ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలి అని నిర్మాతలు మొదటి నుండి ప్రిపేర్ గానే ఉండగా…
సినిమా సాంగ్స్ కి సినిమా కి కూడా మంచి హైప్ ఉండటం తో నిర్మాతలు నో చెబుతున్నా వరుస ఆఫర్స్ మొదటి నుండి వస్తూనే ఉండగా ముందు సినిమా కి 18-19 కోట్ల రేంజ్ దాకా వెళ్ళిన ఆఫర్లను నిర్మాతలు నో చెప్పి పంపారు, సినిమా బడ్జెట్ కూడా 17 కోట్ల రేంజ్లో జరిగిందని సమాచారం.
ఆ బడ్జెట్ కి అప్పుడు ఆ రేటు సబబే అనిపించినా వి మూవీ డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా ఆఫర్లు నో చెప్పినా వస్తూనే ఉన్నాయి కానీ ఈ సారి రేట్లు మాత్రం చాలా తక్కువగా చెబుతున్నారాన్ని అంటున్నారు. రీసెంట్ గా 13 కోట్ల రేంజ్ ఆఫర్లు రాగా ఇప్పుడు 12 కోట్ల రేంజ్ రేటు ఇస్తామని ఆఫర్ చేశారట.
ఈ రేట్లు చూసి నిర్మాతలు సినిమాను ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మరోసారి చెప్పగా… అయినా ఆలోచించడి అన్నట్లు వీళ్ళ ప్రపోజల్స్ చెబుతున్నారట. కానీ యూనిట్ ముందు పెద్ద ఆఫర్స్ ఇచ్చి ఇప్పుడు రేటు తగ్గిస్తూ ఆలోచించండి అంటారేంటి అనుకుంటున్నారట. త్వరలోనే యూనిట్ నుండి సినిమా పై కొత్త అప్ డేట్ వస్తుందని సమాచారం. మొత్తం మీద ఈ ఆఫర్స్ చూసిన టీం సినిమా బడ్జెట్ ఏంటి ఈ ఆఫర్స్ ఏంటి అనుకుంటున్నారట.