Home న్యూస్ అమెరికాలో రీ రిలీజ్ టాప్ కలెక్షన్స్…కొత్త రికార్డుల జోరు!

అమెరికాలో రీ రిలీజ్ టాప్ కలెక్షన్స్…కొత్త రికార్డుల జోరు!

0

టాలీవుడ్ లో రెండేళ్ళ నుండి రీ రిలీజ్ ల ట్రెండ్ మంచి జోరు అందుకుంది, కానీ రీసెంట్ టైంలో ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది…అలాంటి టైంలో ఇక రీ రిలీజ్ ల ట్రెండ్ ఆగిపోయింది అనుకుంటున్న టైంలో మూడు రీ రిలీజ్ లు తిరిగి అప్ కమింగ్ రీ రిలీజ్ మూవీస్ కి ప్రాణం పోశాయి అని చెప్పాలి ఇప్పుడు…

మురారి, ఇంద్ర మరియు గబ్బర్ సింగ్ సినిమాలు బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి ఒక్కో సినిమా ఒక్కో చోట రికార్డ్ కొట్టింది….లాంగ్ రన్ లో మురారి రికార్డ్ కొడితే, ఓపెనింగ్ డే పరంగా అమెరికాలో ఇంద్ర మూవీ రికార్డ్ కొట్టింది. వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ లో గబ్బర్ సింగ్ రికార్డ్ కొట్టింది…

ఇక అమెరికాలో టోటల్ రన్ పరంగా గబ్బర్ సింగ్ మూవీ ఇంద్ర మూవీ టోటల్ రన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. మురారి మూవీ ఫస్ట్ 60 వేల డాలర్స్ ను అక్కడ అందుకుంటే, ఇంద్ర మూవీ 65 వేల క్లబ్ ని ఓపెన్ చేసింది…గబ్బర్ సింగ్ చిన్న మార్జిన్ తో ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది.

ఒకసారి అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న రీ రిలీజ్ మూవీస్ ని గమనిస్తే… 
Tollywood Top Re-Release Movies USA Gross Records
👉#GabbarSingh4K: $66,186+*****
👉#Indra4K – $65,720
👉#Murari4K – $60,642
👉#Simhadri4K – $59,843
👉#ChennaKesavaReddy – $51,129
👉#Jalsa – $37,973
👉#Businessman4K – $27,390
👉#Kushi4K – $24,296
👉#Pokiri – $15,846
👉#Billa – $13,581

రీ రిలీజ్ ల జోరు ముందు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయినా కూడా తర్వాత అది అమెరికా దాకా పాకి అక్కడ కూడా రికార్డుల జోరు చూపించగా అప్ కమింగ్ టైంలో రీ రిలీజ్ లలో అమెరికాలో ఏ సినిమా కొత్త రికార్డును నమోదు చేస్తుంది, అలాగే మొదటి లక్ష డాలర్స్ మార్క్ ని అందుకునే రీ రిలీజ్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here