సమ్మర్ టాలీవుడ్ లో వరుస సినిమా లతో ఓ రేంజ్ లో ఉంటుంది అని ఊహించుకున్న వాళ్ళందరికీ షాక్ ఇస్తూ కరోనా ఎఫెక్ట్ తో సమ్మర్ లో చాలా టైం ఇంట్లోనే గడిచిపోగా ఇక మిగిలిన టైం లాక్ డౌన్ తర్వాత కూడా వేరే పనులతో గడిచి పోతుంది. ఇక సమ్మర్ కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా కొన్ని డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్నాయి.
కాగా సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు మాత్రం ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడు సద్దుమనుగుతాయో థియేటర్స్ లో రిలీజ్ అవుదాం అని ఎదురు చూస్తున్నాయి. వాటి లో ముఖ్యంగా నాని వి ది మూవీ, రామ్ నటించిన రెడ్ అలాగే రవితేజ నటించిన…
క్రాక్ సినిమా లు ముందు నిలిచాయి…. ఈ వైరస్ ఎఫెక్ట్ ఇప్పట్లో విడిచేలా లేదని తగ్గని కేసులు చూస్తె అర్ధం అవుతుంది. మరో రెండు మూడు నెలలు మినిమమ్ టైం పట్టేలా ఉందని అందరూ అంటున్నారు. ఒకవేళ తగ్గినా కానీ థియేటర్స్ రీ ఓపెన్ చేస్తే జనాలు వస్తారో రారో అన్న క్లారిటీ కూడా ఎవ్వరికీ లేదు…
ఇలాంటి టైం లో సినిమాల రిలీజ్ ఆపి తక్కువ బిజినెస్ తో జనాల ముందుకు వస్తే వాళ్ళు చూడకపోతే ఎలా అని ఒక ఆలోచన మరో వైపు సైలెంట్ గా బెటర్ ఆఫర్ కి OTT లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక ఆశతో సినిమాలు చాలా వరకు ఊహిస లాడుతున్నాయని సమాచారం.
డిజిటల్ రిలీజ్ అయితే బిజినెస్ లో చాలా వరకు డబ్బు ఓకె సారి వస్తుంది అన్న ఆశ ఉన్నప్పటికీ థియేటర్స్ లో జనాల మధ్య సినిమా చూస్తె వచ్చే మజా ఎందులో రాదనీ భావించే వారు కూడా ఉన్నారు. అందుకే ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా కొద్దిగా ఆలస్యం అయినా థియేటర్స్ లోనే రావాలని చూస్తున్నారు. కానీ అదే సమయం లో పరిస్థితి కొంత సమయం తర్వాత కూడా సెటిల్ కాకుంటే ఇక డిజిటల్ రిలీజ్ కి కూడా సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు…