మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అయిన పంజా వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన. బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రావాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యి డిజిటల్ రిలీజ్ కి అనేక ఆఫర్స్ వచ్చినా కానీ నో చెబుతూ రాగా లాస్ట్ ఇయర్ రిలీజ్ టైం కి ఉన్న హైప్ పెద్దగా ఏమి లేకున్నా కానీ సాంగ్స్ అల్టిమేట్ హిట్ వలన పాండమిక్ టైం మొత్తం సినిమా పాటలు వార్తల్లోనే నిలుస్తూ వచ్చాయి.
ఆ ఇంపాక్ట్ కి తోడూ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అవ్వడం, అది మీమ్స్ తో ఫుల్ పాపులారిటీ ని సొంతం చేసుకోవడం తో హైప్ అంచనాలను మించి పెరిగి పోగా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ హిట్ ని సొంతం చేసుకుని ఇప్పుడు 50 కోట్ల రేంజ్ కి దూసుకు పోతుంది ఉప్పెన సినిమా…
నిజం చెప్పాలి అంటే… లాస్ట్ ఇయర్ అనుకున్న టైం కి రిలీజ్ అయినా ఇప్పుడొచ్చిన రిజల్ట్ సాధ్యం అయ్యేదో లేదో చెప్పలేం.. ఆ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతూ రావడం తో పంజా వైష్ణవ్ తేజ్ ఈ రిలీజ్ గ్యాప్ లో మరో సినిమా కూడా ఫినిష్ చేశాడు.
ఇక ఉప్పెన సినిమా కి గాను పంజా వైష్ణవ్ తేజ్ ను లాంచ్ చేయడానికి సిద్ధం చేయగా ఆ టైం కి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు హీరో కి 50 లక్షల రెమ్యునరేషన్ ని హీరోయిన్ కి 10 లక్షల రెమ్యునరేషన్ ని ఇచ్చారట. ఇక రెండో సినిమా కి వచ్చే సరికి పంజా వైష్ణవ్ తేజ్ కి 75 లక్షల రెమ్యునరేషన్ దక్కింది అని సమాచారం. 50 లక్షల రెమ్యునరేషన్ ని మాత్రమే అందుకున్నా ఇప్పుడు క్రేజ్…
ఓ రేంజ్ లో పెరగడంతో వైష్ణవ్ తేజ్ కి భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారట నిర్మాతలు. ఇక ఉప్పెన సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు… హీరో కి మరో కోటి రెమ్యునరేషన్ ని గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక హీరోయిన్ కి 50 లక్షల రెమ్యునరేషన్ మళ్ళీ ఇచ్చారని సమాచారం…