మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్మీకి కొన్ని చోట్ల కొన్ని కారాణాల వలన టైటిల్ ని మార్చుకుని గద్దల కొండ గణేష్ గా నేడు వరల్డ్ వైడ్ గా 940 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ముందు గా ఓవర్సీస్ లో ప్రీమియర్ షో లను పూర్తీ చేసు కున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ లభిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.
స్టొరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా… ఫాక్షన్ స్టొరీ ని డైరెక్ట్ చేయాలి అనుకునే ఓ కుర్రాడు రియల్ గూండాని తెలియకుండా ఫాలో అవుతాడు, ఆ విషయం తెలిసిన తర్వాత ఆ గూండా ఆ డైరెక్టర్ ని ఏం చేశాడు అన్నది అసలు కథ అంటున్నారు.
సినిమా స్టొరీ పాయింట్ ఒరిజినల్ లో ఉన్న మెయిన్ ప్లాట్ నే తీసుకున్నా తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా దర్శకుడు హరీష్ శంకర్ సినిమా లో కొన్ని మార్పులు చేశాడని అవి అద్బుతంగా సెట్ అయ్యాయని అంటున్నారు, వరుణ్ తేజ్ సినిమా కి హార్ట్ అండ్ సోల్ అని అంటున్నారు.
తన పెర్ఫార్మెన్స్, డైలాగ్స్, మ్యానరిజమ్స్ ఇలా అన్నీ చాలా స్పెషల్ గా డిసైన్ చేశారని అంటున్నారు, ఇక తమిళ్ హీరో అతర్వ తొలి తెలుగు సినిమా అయినా బాగా మెప్పిస్తాడని అంటున్నారు. పూజా హెడ్గే మరియు కొత్త హీరోయిన్ ఉన్నంతలో ఆకట్టుకున్నారని అంటున్నారు.
మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు, ఎల్లువచ్చే గోదారమ్మా రీమిక్స్, సూపర్ హిట్టు సాంగ్, ఇలా సాంగ్స్ చాలా బాగా ఇవ్వడమే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా దుమ్ము లేపాడని అంటున్నారు.
డైరెక్షన్ పరంగా హరీష్ శంకర్ మరోసారి రీమేక్ ని ఎంచుకున్నా తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా కథని మలిచి చాల వరకు మెప్పించాడని అంటున్నారు, కానీ లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ స్లో నరేషన్ ఎక్కువగా ఉండటం సినిమా కి మేజర్ డ్రా బ్యాక్స్ అని అంటున్నారు..
అవి తప్పితే సినిమా చాలా బాగుందని అంటున్నారు. ఫైనల్ గా ఓవర్సీస్ నుండి సినిమా కి హిట్ నుండి సూపర్ హిట్ అనిపించే టాక్ ఎక్కువగా వినిపిస్తుందని చెప్పొచ్చు. ఇక ఇదే టాక్ రెగ్యులర్ షోలకు కూడా ఇక్కడ వినిపిస్తే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.