Home న్యూస్ వరుడు కావలెను రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

వరుడు కావలెను రివ్యూ….సినిమా ఎలా ఉందంటే!!

0

యంగ్ హీరో నాగశౌర్య మరియు రితు వర్మ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను టీసర్ ట్రైలర్స్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అనిపించగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుందో లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ కి వస్తే… చిన్న స్టార్టప్ కంపెనీ పెట్టుకున్న హీరోయిన్ ని ఒక….

ఆర్కిటేక్చురల్ ప్రాజెక్ట్ కోసం కలవడానికి వస్తాడు హీరో… వచ్చి హీరోయిన్ ని చూసే సరికి వీళ్ళకి ఇది వరకే పరిచయం ఉంటుంది, ఆ ఫ్లాఫ్ బ్యాక్ లో హీరోని ఇష్టపడుతుంది హీరోయిన్ కానీ ఇష్టం చెప్పేలోపే ఎవరి దారిలో వాళ్ళు వెళతారు… ఇప్పుడు కొన్నేళ్ళ తర్వాత హీరోయిన్ ని…

హీరో ఇష్టపడటం స్టార్ట్ చేస్తాడు… మరి వీళ్ళ ప్రేమ సఫలం అయిందా లేదా అన్నది సినిమా కథ పాయింట్… అతి సాధారణమైన చిన్న కథ పాయింట్ తో తెరకెక్కిన సినిమా వరుడు కావలెను… ఫస్టాఫ్ వరకు పాత్రల పరిచయం, హీరో ఇండియా వచ్చిన తర్వాత హీరోయిన్ ని ఇష్టపడటం… తనని ఇంప్రెస్ చేసే పనిలో…

వచ్చే సీన్స్ బాగానే ఆకట్టుకోగా ఇంతలో వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇంటర్వెల్ వరకు కథ సరదా సరదాగా సాగగా ఇంటర్వెల్ పాయింట్ సెకెండ్ ఆఫ్ పై ఆసక్తి పెంచగా సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అయ్యి మెల్లి మెల్లిగా స్లో అవుతూ సాగగా మురళీశర్మ మరియు నదియాల మధ్య కూతురి పెళ్లిపై…

మంచి డైలాగులతో మళ్ళీ ఆకట్టుకోగా తర్వాత సప్తరిగి కామెడీ మెప్పించి క్లైమాక్స్ సింపుల్ గా ఎండ్ అవుతుంది…. పెర్ఫార్మెన్స్ పరంగా నాగ శౌర్య తన రోల్ లో బాగా నటించి మెప్పించగా రితు వర్మ కూడా బాగా ఆకట్టుకుంది, ఇద్దరి పెయిర్ మెప్పించగా, నదియా మురళీశర్మల రోల్స్ ఆకట్టుకున్నాయి… సప్తరిగి వెన్నెల కిషోర్ ల కామెడీ కూడా బాగానే ఉంది…

సంగీతం బాగుండగా దిగు దిగు దిగు నాగా సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉండగా డైలాగ్స్ చాలా బాగున్నాయి, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వరకు ఆడియన్స్ అంచనాలను తగ్గట్లు గానే ఉంది… సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…

లక్ష్మీ సౌజన్య చాలా చిన్న స్టొరీని ఎక్కడా ఓవర్ ది టాప్ కి వెళ్ళకుండా సింపుల్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిక్స్ చేసి బాగానే చెప్పే ప్రయత్నం చేసింది కానీ కథ చెప్పడానికి ఎక్కువగా లేక పోవడంతో సెకెండ్ ఆఫ్ లో చాలా స్లో అవుతుంది సినిమా… ఫ్యామిలీ ఆడియన్స్ కి అర్బన్ ఆడియన్స్ కి కొంచం ఎక్కువ నచ్చే అవకాశం ఉన్న సినిమా యూత్ ఆడియన్స్ కి జస్ట్ ఓకే అనిపిస్తుంది…

స్టార్ కాస్ట్, నాగశౌర్య- రితు వర్మల పెర్ఫార్మెన్స్, డీసెంట్ కామెడీ సీన్స్, మ్యూజిక్, క్లీన్ ఫ్యామిలీ స్టొరీ లాంటివి ఉండటం సినిమా ప్లస్ పాయింట్స్ కాగా కథ బలంగా లేక పోవడం, స్కీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగడం లాంటివి సినిమా మేజర్ మైనస్ పాయింట్స్… అయినా కానీ సినిమా క్లాస్ ఆడియన్స్ అండ్ అర్బన్ యూత్ కి బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here