Home న్యూస్ సౌత్ రికార్డ్ నెలకొల్పిన అల్లుఅర్జున్….”సామి సామి” సాంగ్ ఆల్ టైం రికార్డ్

సౌత్ రికార్డ్ నెలకొల్పిన అల్లుఅర్జున్….”సామి సామి” సాంగ్ ఆల్ టైం రికార్డ్

1223
0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక ల కాంబినేషన్ లో సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 17 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా సాంగ్స్ తో సోషల్ మీడియాలో ఆల్ రెడీ సాలిడ్ రచ్చ చేస్తుంది. సినిమాలో ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక ఆల్ రెడీ సంచలన రికార్డ్ ను నమోదు చేయగా తర్వాత వచ్చిన…

శ్రీవల్లి సాంగ్ కి ఇనీషియల్ గా రెస్పాన్స్ అంత భారీగా రాకున్నా తర్వాత సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. ఇక సినిమాలో మూడో సాంగ్ సామి సామి చిన్న ప్రోమో తోనే మంచి హైప్ ను అందుకోగా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత రంగస్థలంలో రంగమ్మా మంగమ్మా సాంగ్…

కాపీ లా ఉందంటూ సోషల్ మీడియా లో కొన్ని ట్రోల్స్ కనిపించినా 24 గంటల్లో మాత్రం వ్యూస్ తో ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది ఈ సాంగ్… 24 గంటల్లో టాలీవుడ్ పరంగా అలాగే సౌత్ లో ఇది వరకు వ్యూస్ పరంగా పుష్ప ఫస్ట్ సాంగ్…

దాక్కో దాక్కో మేక 8.32 మిలియన్ వ్యూస్ తో ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేయగా ఆ రికార్డ్ ను ఇప్పుడు సామి సామి సాంగ్ బ్రేక్ చేసి సౌత్ లో 24 గంటల్లో ఫస్ట్ టైం 9 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్న సాంగ్ గా ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది.. ఈ సాంగ్ మొత్తం మీద 24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి…

వ్యూస్ పరంగా 9.06 మిలియన్ వ్యూస్ ని లైక్స్ పరంగా 433.1K లైక్స్ ని అందుకుంది. వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేసినా లైక్స్ పరంగా ఓవరాల్ గా టాప్ 6 ప్లేస్ తోనే సరిపెట్టుకుంది ఈ సాంగ్… మొత్తం మీద సాంగ్ కి రెస్పాన్స్ సాలిడ్ గా ఉండటంతో లాంగ్ రన్ లో వ్యూస్ పరంగా మరిన్ని సంచలనాలను ఈ సాంగ్ సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here