కరోనా ఎంటర్ అయినప్పుడు అన్ని ఇండస్ట్రీ ల సినిమాలు తమ తర్వాత స్టెప్ ఏంటి అనే దానిపై డౌట్ లో ఉంటె బాలీవుడ్ మాత్రం ఫుల్ క్లారిటీ తో అప్పటికి షూటింగ్ అయిన అన్ని సినిమాలను తమ తమ రేంజ్ ని బట్టి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలా సినిమాలు ఇప్పటికే డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకోగా మరిన్ని సినిమాలు….
కూడా త్వరలోనే డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి…. అలాంటి సినిమాల్లో కొంచం హైప్ ఉన్న సినిమా లలో ఒకటిగా నిలిచిన వరుణ్ ధవన్ నటించిన కొత్త సినిమా కూలీ నంబర్ 1 కూడా ఒకటి అని చెప్పాలి. 1995 లో వచ్చిన కూలీ నంబర్ 1 సినిమా కి రీమేక్ గా వస్తున్న….
ఈ సినిమా లో వరుణ్ ధవన్ మరియు సారా అలీ ఖాన్ లు జంటగా నటిస్తుండగా డేవిడ్ ధవన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సమ్మర్ కానుకగా మే 1 న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల ఆగిపోగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కంప్లీట్ చేసుకుని…
ఫస్ట్ లుక్ లు రిలీజ్ కూడా అయ్యాయి. ఇక సినిమా ను డైరెక్ట్ గా రిలీజ్ చేయడానికి OTT యాప్స్ మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నట్లు సమాచారం, రీసెంట్ టైం లో పెద్దగా హిట్స్ కొట్టాక ఫాం కొద్దిగా కోల్పోయినా కానీ సినిమా పై ఉన్న బజ్ దృశ్యా ఈ సినిమా కి అమెజాన్ ప్రైమ్ ఏకంగా…
80 కోట్ల రేంజ్ రేటు చెల్లించడానికి ముందుకు వచ్చిందని సమాచారం… ఇది తన రీసెంట్ మూవీస్ బిజినెస్ ల కన్నా కూడా ఎక్కువ రేటు అనే చెప్పాలి. కానీ సినిమా యూనిట్ రేటు విషయం లో ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. త్వరలోనే సినిమా యూనిట్ నుండి నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.