మల్టీ స్టారర్ మూవీస్ తో రీసెంట్ టైం లో మళ్ళీ రెట్టించిన జోరు చూపెడుతున్న విక్టరీ వెంకటేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా కూడా మళ్ళీ దుమ్ము లేపాలని చూస్తున్నాడు, లాస్ట్ టైం సోలో హీరోగా బాబు బంగారం గురు లాంటి సినిమాలతో మెప్పించిన వెంకీ ఎక్కువగా రీమేక్ సినిమాలు లేదా మల్టీ స్టారర్ మూవీస్ తోనే వస్తుండగా ఇప్పుడు ఈ ఏడాదికి గాను మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు.
ముందు అసురన్ రీమేక్ నారప్ప తర్వాత ఎఫ్ 3 సినిమాలు ఉండగా సడెన్ గా మధ్యలో జాయిన్ అయిన మలయాళ OTT బ్లాక్ బస్టర్ దృశ్యం 2 సినిమా తెలుగు రీమేక్ ని అతి తక్కువ టైం లో రూపొందించి షూటింగ్ మొత్తాన్ని సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ మొదలు అయ్యే లోపే…
కంప్లీట్ చేసి సంచలనం సృష్టించారు. ఇక ఈ సినిమా ఆడియన్స్ ముందుకు జూన్ లో వస్తుంది అనుకుంటే సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్ర తరం అవ్వడం పరిస్థితులు ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించక పోవడం తో సినిమాను OTT లో రిలీజ్ చేస్తున్నారు అంటూ రీసెంట్ గా వార్తలు శిఖారు చేయగా…
మేకర్స్ సినిమా ను ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లోనే వస్తుందని చెప్పుకొచ్చారు… కానీ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న స్ట్రాంగ్ బజ్ ఏంటంటే సినిమా డిజిటల్ రిలీజ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కి భారీ రేటు కి అమ్మినట్లు చెబుతున్నారు. అది పోస్ట్ రిలీజ్ హక్కులు కావని డైరెక్ట్ రిలీజ్ హక్కులని అంటున్నారు ఇండస్ట్రీలో.. దాంతో ఆల్ మోస్ట్ సినిమా…
డిజిటల్ హక్కులు అమ్ముడు పోయినట్లే అని అంటున్నారు, రేటు ఇంత అనేది క్లియర్ గా ఏమి రివీల్ కాలేదు కానీ 30 కోట్లకు పైగానే డీల్ క్లోజ్ అయిందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ప్రైమ్ వాళ్ళు ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో ఈ సినిమా కూడా ఒరిజినల్ మాదిరిగానే డిజిటల్ రిలీజ్ సొంతం చేసుకోవడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయిందని చెప్పొచ్చు.