సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ మాస్ రచ్చ చేసిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఇక్కడ మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కొన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది….
కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు భారీ నష్టాలను సొంతం చేసుకుని నిరాశ పరిచింది.
విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి కలెక్షన్స్ ని అందుకోగా లాస్ట్ మూవీ లియో మీడియం రేంజ్ మూవీస్ రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు గోట్ మూవీ కి 21 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా…
మినిమమ్ ఇంపాక్ట్ ను అయినా చూపిస్తుంది అనుకుంటే గోట్ మూవీ తెలుగు లో మొదటి రోజు నుండే తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని వీకెండ్ లోనే చేతులు ఎత్తేసింది. మిక్సుడ్ టాక్ తో వరల్డ్ వైడ్ గా 280 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని…
ప్రపంచాన్ని మిక్సుడ్ టాక్ తోనే ఏలుతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా బిజినెస్ దృశ్యా ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది…ఏ దశలో కూడా సినిమా తేరుకునే అవకాశం కనిపించడం లేదు ఇప్పుడు. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా మరింతగా డ్రాప్ అయ్యే అవకాశం ఉండటంతో…
తెలుగు లో భారీ నష్టాలనే సినిమా సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు…రీసెంట్ మూవీస్ తో మాస్ రచ్చ చేసిన విజయ్ ఈ సారి మాత్రం తెలుగులో అంచనాలను అందుకోలేక పోయాడు. ఇక టోటల్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.