Home న్యూస్ విజయ్ సర్కార్ TRP రేటింగ్…రికార్డులు బద్దలు!

విజయ్ సర్కార్ TRP రేటింగ్…రికార్డులు బద్దలు!

0

    కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నిర్మాతల లెక్కల ప్రకారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 135 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టోటల్ గా 260 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా షేర్ పరంగా 139 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇక సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో సంక్రాంతి కానుకగా తెలుగు తమిళ్ లో ఒక్క రోజు గ్యాప్ తో టెలికాస్ట్ అవ్వగా సినిమాకి రెండు చోట్లా అద్బుతమైన TRP రేటింగ్ దక్కింది అని చెప్పొచ్చు. తమిళ్ లో అయితే అక్కడ సరికొత్త రికార్డులతో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ తో…

సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా… ఓవరాల్ గా కోలివుడ్ మూవీస్ లో ఆల్ టైం టాప్ 5 TRP రేటింగ్ సాధించిన మూవీస్ ని గమనిస్తే… 1. Pitchaikkaran 27 TRP, 2. Sarkar 21.7 TRP , 3. SeemaRaja – 21.52 TRP , 4. Singam3 – 20.55 TRP , 5. Bairavaa – 19.5 TRP..

మొదటి ప్లేస్ లో బిచ్చగాడు టాప్ ప్లేస్ లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో కొనసాగుతుంది. ఇక ఇప్పుడు విజయ్ సర్కార్ సినిమాతో టాప్ 2 లో నిలవగా ఓవరాల్ గా టాప్ 5 లో రెండు సినిమాలతో సత్తా చాటాడు. ఇక సర్కార్ తెలుగు లో ఓవరాల్ గా 5.9 TRP రేటింగ్ ని సాధించింది. ఇది…

తెలుగు లో విజయ్ కెరీర్ లో రికార్డ్ లెవల్ TRP రేటింగ్ అని చెప్పాలి. ఇది వరకు అదిరింది సినిమా తెలుగు లో టోటల్ గా 5.4 TRP రేటింగ్ ని అందుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయింది. మొత్తం మీద తెలుగు తమిళ్ లో కెరీర్ బెస్ట్ TRP రేటింగ్ తో విజయ్ దుమ్ము లేపాడు అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here