Home TRP రేటింగ్ మెంటల్ మాస్ రికార్డ్…ఫస్ట్ టైం కన్నా 4వ సారి సెన్సేషనల్ TRP

మెంటల్ మాస్ రికార్డ్…ఫస్ట్ టైం కన్నా 4వ సారి సెన్సేషనల్ TRP

0

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ కి తెలుగు లో సాలిడ్ గా పాపులారిటీ పెరుగుతుంది, ఓకె సారి కాకుండా ఇక్కడ సినిమా సినిమా కి ఒక్కో మెట్టు ఎక్కుతూ తన పాపులారిటీ ని పెంచుకుంటున్నాడు విజయ్. ఇక రీసెంట్ మూవీస్ అయితే అద్బుతమైన ఓపెనింగ్స్ ని తెచ్చుకోవడమే కాకుండా ప్రతీ సినిమా కూడా పాత కెరీర్ బెస్ట్ ని దాటేసి కొత్త కెరీర్ బెస్ట్ గా నిలుస్తూ వస్తున్నాయి.

లాస్ట్ ఇయర్ దీపావళి కి రిలీజ్ అయిన విజయ్ నటించిన బిగిల్ తెలుగు లో విజిల్ పేరు తో డబ్ అవ్వగా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా విజయ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. తర్వాత సినిమా ను టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా…

అప్పటి వరకు విజయ్ సినిమాలకు తెలుగు లో బెస్ట్ TRP రేటింగ్ ని అందుకున్న సినిమా గా నిలిచి సంచలనం సృష్టించగా తర్వాత సెకెండ్ టైం కూడా డీసెంట్ హోల్డ్ ని అందుకోగా మూడోసారి 0.01 పెర్సెంట్ తో మళ్ళీ కెరీర్ బెస్ట్ ని అందుకుంది. ఇక రీసెంట్ గా నాలుగో సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా…

ఏకంగా మొదటి సారి కన్నా కూడా ఎక్కువ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. విజయ్ కెరీర్ లో తెలుగు లో ఇదే హైయెస్ట్ కాగా 4 వ సారి టెలికాస్ట్ TRP రేటింగ్ ఫస్ట్ టైం కన్నా ఎక్కువ రావడం అది కూడా డబ్బింగ్ మూవీ కి రావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఒకసారి సినిమా 4 సార్లు సాధించిన TRP రేటింగ్ లను గమనిస్తే…
👉1st Time(jan30) – 6.86 TRP
👉2nd Time(Feb23) – 5.10 TRP
👉3rd Time(Apr 30) – 6.87 TRP
👉4th Time(jul 9) – 7.18 TRP💥💥
ఇదీ మొత్తం మీద విజిల్ సినిమా తెలుగు లో నాలుగు సార్లు టెలికాస్ట్ అయినప్పుడు సాధించిన TRP రేటింగ్… వెండితెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి…

Vijay Whistle 3rd Time TRP higher Than 1st Time....Mass

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here