మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి మొదటి 8 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ తో 60 కోట్ల లీగ్ లో అడుగు పెట్టినా తర్వాత మాత్రం స్లో డౌన్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా 2 వారాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయం లో కొంత నిరాశనే మిగిలించింది.
మొదటి 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ అల్టిమేట్ లెవల్ లో ఉండటం తో సినిమా తర్వాత కూడా అదే రేంజ్ లో కాకుండా మినిమమ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అనుకున్నా కానీ హాలిడేస్ అయిపోవడం తో సినిమా పై ఆ ప్రభావం గట్టిగానే పడింది.
దాంతో సెకెండ్ వీక్ వర్కింగ్ డేస్ లో సినిమా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేక పోవడం తో సినిమా మొత్తం మీద 2 వారాల్లో 62.5 కోట్ల మార్క్ ని మాత్రమె అధిగమించింది. ఇక సినిమా ఏరియాల వారి 2 వారాల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
Nizam- 12.65C, Ceeded- 11.56C, UA- 8.25C, Nellore- 2.85C, Guntur- 6.45C, Krishna- 3.67C, West- 4.38C, East- 5.4C, Total AP & Nizam – 55.21C, Ka : 5.25 Cr, ROI : 0.7 Cr, USA 0.6cr, ROW : 0.8 Cr, Worldwide : 62.56 Cr
సినిమాను టోటల్ గా 90 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 91 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 2 వారల్ల్లో టోటల్ గా 62.56 కోట్లు వెనక్కి తేవడం తో మిగిలిన రన్ లో మరో 28.5 కోట్ల షేర్ ని అందుకోవాలి, అది అసాధ్యం అనే చెప్పాలి. అయినా కానీ సినిమా మొదటి రోజు టాక్ కి ఈ రేంజ్ వసూళ్లు అంటే గొప్పే అని చెప్పాలి.