Home న్యూస్ ఈ టాక్ కే భీభత్సం అంటే…హిట్ టాక్ వచ్చి ఉంటేనా!

ఈ టాక్ కే భీభత్సం అంటే…హిట్ టాక్ వచ్చి ఉంటేనా!

0

     2019 సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు నుండి భారీ క్రేజ్ నడుమ అంచనాలు పీక్స్ కి వెళ్లి పోయిన సినిమా వినయ విధేయ రామ.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా అవ్వడం, బోయపాటి శ్రీను లాంటి మాస్ లో భారీ క్రేజ్ ఉన్న డైరెక్టర్ అవ్వడం తో వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది అని అంతా భావించారు.

కానీ సినిమా బోయపాటి ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే వీక్ కంటెంట్ తో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది, కానీ సంక్రాంతి సీజన్ ముగిసే సరికి సినిమా 60 కోట్ల లీగ్ లో అడుగు పెట్టి సంచలనం సృష్టించింది, సినిమా కి సెలవులు, మరియు భారీ హైర్స్…

ఒక పక్క భారీ గా హెల్ప్ చేయగా రామ్ చరణ్ మాస్ లో ఉన్న స్టార్ పవర్ కూడా హెల్ప్ అయ్యి సెలవుల్లో ఆడియన్స్ ని భారీ గా థియేటర్స్ కి తీసుకు రాగలిగింది. దాంతో సినిమా ఫేట్ పక్కకు పెడితే రామ్ చరణ్ కెపాసిటీ మరోసారి రుజువు అయ్యింది.

పక్కన ఒక సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లేక విలవిలలాడుతుంటే, మరో పక్క లేట్ గా వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంటే, ఈ సినిమా కి హైర్స్ పెట్టి బయ్యర్లు సంక్రాంతి రోజుల్లో రిజల్ట్ తెలిసినా కొనడం గొప్పే అని చెప్పాలి.

అలా కాకుండా సినిమా కి పాజిటివ్ టాక్ లభించి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ మరిన్ని రోజులు కొనసాగి, టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డులు అందుకున్న సినిమాల జాబితా లో ఈ సినిమా ఒకటి గా చేరేది అని చెప్పొచ్చు, మరి ఫైనల్ రన్ లో మూవీ మరెంత దూరం వెళుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here