Home న్యూస్ వినయ విధేయ రామ 89…F2–90+…F2 No 1

వినయ విధేయ రామ 89…F2–90+…F2 No 1

1

     2019 సంక్రాంతి సీజన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయింది, ఈ ఇయర్ భారీ ఆశలు అంచనాలు పెట్టుకున్న రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు, ముఖ్యంగా రిలీజ్ కి ముందు రికార్డుల వర్షం కురిపిస్తుంది అనుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కలెక్షన్స్ లేక బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిలించి షాక్ ఇచ్చింది.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమా అవ్వడం తో కలెక్షన్స్ లెక్కలు ఓ రేంజ్ లో ఉండటం ఖాయం అని అంతా భావించారు, కానీ సినిమా రిజల్ట్ తేడా గా వచ్చినా…

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల వరకు సినిమా మంచి వసూళ్ళనే సాధించి 11 రోజులలో టోటల్ వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 89 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసింది, సినిమా టాక్ కి ఈ వసూళ్లు ఈ రేంజ్ లో రావడం రామ్ చరణ్ స్టార్ పవర్ కి హాలిడేస్ హెల్ప్ అవ్వడం అనే చెప్పాలి.

ఇక రేసు లో చివరగా వచ్చిన వెంకీ వరుణ్ తేజ్ ల F2 మాత్రం బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది, రిలీజ్ కి ముందు అంచనాలు తక్కువగా ఉండటం తో టాక్ ఎలా ఉన్న వినయ విధేయ రామ సంక్రాంతి హైయెస్ట్ గ్రాసర్ గా ఉంటుంది అనుకున్నారు.

కానీ F2 సినిమా ఊహకందని లెవల్ లో గ్రోత్ ని కంటిన్యు చేసి 10 రోజులు ముగిసే సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర 90 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది 2019 సంక్రాంతి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఇప్పుడు సంక్రాంతి ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలవడానికి సిద్ధం అవుతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here