మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు విరూపాక్ష సినిమాతో అతి త్వరలో రాబోతున్నాడు. ఈ సినిమా కన్నా ముందు సాయి ధరం తేజ్ చేసిన రిపబ్లిక్ మూవీ అంచనాలను అందుకోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు విరూపాక్ష సినిమాతో రాబోతున్న సాయి ధరం తేజ్ ఈ సినిమాతో….
కచ్చితంగా మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు సాయి ధరం తేజ్ కెరీర్ లో రూపొందిన సినిమాలు అన్నింటిలోకీ ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అని ట్రేడ్ సమాచారం.
ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కడం క్వాలిటీ పరంగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తెరకేక్కడంతో సినిమా కోసం ఏకంగా 42 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ని పెట్టి సినిమాను నిర్మించారని అంటున్నారు. ప్రమోషన్స్ అండ్ ప్రింట్ ఖర్చులు అన్నీ కలిపి…
మరో 4-5 కోట్ల దాకా అదనపు ఖర్చు కూడా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో టోటల్ బడ్జెట్ 47 కోట్ల లోపు ఉండబోతుండగా నాన్ థియేట్రికల్ రైట్స్ తో చాలా వరకు రికవరీ జరగగా థియేట్రికల్ బిజినెస్ కూడా డీసెంట్ రేటుని సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.