మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా సమ్మర్ లో సెన్సేషనల్ లాభాలను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నైజాంలో ఊరమాస్ లాభాలను సొంతం చేసుకోగా పెద్దగా మాస్ ఎలిమెంట్స్ లాంటివి లేక పోయినా కూడా రాయలసీమ లో కూడా లాంగ్ రన్ ని దక్కించుకుని…
మరీ భారీ లాభాలు కాకున్నా కానీ బిజినెస్ జరిగిన తీరు దృశ్యా ఎక్స్ లెంట్ ప్రాఫిట్ ను ఇక్కడ కూడా సొంతం చేసుకుంది. సినిమా 3.70 కోట్ల దాకా బిజినెస్ ను ఇక్కడ దక్కించుకోగా రిలీజ్ కి ముందు కొంచం డౌట్స్ ఉన్నప్పటికీ రిలీజ్ అయిన తర్వాత జోరు చూపించడం స్టార్ట్ చేసిన…
లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 5 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి ఫైనల్ గా ఇప్పుడు 5.72 కోట్ల దాకా షేర్ ని దక్కించుకుని ఆల్ మోస్ట్ పరుగును పూర్తీ చేసుకుంది. 3.70 కోట్ల బిజినెస్ మీద విరూపాక్ష సినిమా టోటల్ రన్ లో 2.02 కోట్ల రేంజ్ లో…
ప్రాఫిట్ ను సొంతం చేసుకోవడం విశేషం, మాస్ మూవీస్ ని ఎక్కువగా ఆదరించే రాయలసీమలో ఇలాంటి ఎక్స్ పెరిమెంటల్ మూవీ ఈ రేంజ్ లో లాభాలను సొంతం చేసుకోవడం కూడా విశేషం అనే చెప్పాలి. ఈ సినిమా తో ఎపిక్ కంబ్యాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు సాయి ధరం తేజ్.