Home న్యూస్ విరూపాక్ష రివ్యూ…రేటింగ్…హిట్టు కొట్టిన సాయి ధరం తేజ్!

విరూపాక్ష రివ్యూ…రేటింగ్…హిట్టు కొట్టిన సాయి ధరం తేజ్!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ రిపబ్లిక్ ఫ్లాఫ్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష… టీసర్ ట్రైలర్ లు సినిమా పై ఆసక్తిని పెంచగా కథ మాత్రం కొంచం రొటీన్ గా ఉండేలా ఉందనిపించిన ట్రైలర్ జనాలలో సినిమా పై ఆసక్తిని అయితే పెంచింది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన విరూపాక్ష సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

రుద్రవనం అనే ఊరిలో క్షుద్రపూజలు చేస్తున్నారని ఒక జంటని చంపేస్తారు… ఆ ఊరు మొత్తం పుష్కర కాలంలో చనిపోతారని శపిస్తారు…. పుష్కర కాలం దగ్గర పడుతున్న టైంలో ఆ ఊరిలో జరుగుతున్న పరిస్థితులను చూసిన హీరో ఏం చేశాడు… మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అన్నది అసలు కథ…

మెయిన్ స్టొరీ ఇదెలా అనిపించినా కానీ సినిమాలో అనేక ఉపకథలు ఉన్నాయి, అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ స్టార్ట్ అవ్వడం చాలా ఆసక్తిగా స్టార్ట్ అవుతుంది… తర్వాత లవ్ ఎపిసోడ్ కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసినా కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా ఊహించని టర్న్ తీసుకుంటుంది…

ఇక అక్కడ నుండి సినిమాలో వస్తున్న మిస్టరీలను హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్న ఆసక్తితో సాగే కథ మొత్తం కూడా డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశాడు, కొంచం అక్కడక్కడా కథ ప్రిడిక్ట్ చేసేలా ఉండటం లాంటివి పక్కకు పెడితే చాలా సన్నివేశాలు ఎంగేజింగ్ గా మెప్పిస్తాయి. సాయి ధరం తేజ్ తన నటనతో మరోసారి మెప్పించగా కొన్ని హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా బాగున్నాయి.

హీరోయిన్ సంయుక్తా మీనన్ కూడా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ తమ రోల్స్ కి న్యాయం చేశారు. ఇక స్క్రీన్ ప్లే లవ్ సీన్స్ వరకు బోర్ కొట్టిన మిగిలిన సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. ఇక సౌండ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే… చిన్న చిన్న సీన్స్ కి కూడా సౌండ్ ఎఫెక్ట్ తో సాలిడ్ ఎలివేషన్ ని ఇచ్చారు. సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది…

ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అన్నీ ఆకట్టుకున్నాయి… మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే 
సాయి ధరం తేజ్ పెర్ఫార్మెన్స్
సినిమాలో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
ఎక్స్ లెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ 
స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే 
లవ్ ట్రాక్ కొంచం బోర్ కొట్టడం
ఫస్టాఫ్ లో అక్కడక్కడా లాగ్ అయినట్లు అనిపించడం

ఇవే సినిమాలో చిన్న చిన్న మైనస్ పాయింట్స్… ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి సినిమా మిస్టరీతో థ్రిల్ చేస్తూనే కొన్ని సీన్స్ లో హర్రర్ టచ్ తో కూడా శాకిస్తుంది… కానీ ఓవరాల్ గా సినిమా ఎయ్యే టైంకి ఓ మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం మాత్రం ఖాయమని చెప్పాలి. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here