Home న్యూస్ 100కోట్ల హీరో విశాల్…రత్నం ట్రైలర్ రివ్యూ…ఆ సినిమా గుర్తుకు వస్తుంది పక్కా!

100కోట్ల హీరో విశాల్…రత్నం ట్రైలర్ రివ్యూ…ఆ సినిమా గుర్తుకు వస్తుంది పక్కా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ మార్క్ అంథోని(Mark Antony Movie) తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు విశాల్(Vishal), అంచనాలను అన్నీ కూడా మించి పోయిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత…

విశాల్ తమిళ్ లో రేసీ స్క్రీన్ ప్లే తో సినిమాలు చేస్తాడు అన్న పేరున్న హరి డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా రత్నం(Rathnam Movie) చేస్తూ ఉండగా సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 26న గ్రాండ్ గా తమిళ్ అండ్ తెలుగు లో రిలీజ్ చేయబోతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…

ట్రైలర్ లో రెండు ఊర్ల మధ్య గొడవ….ఒక అమ్మాయిని కాపాడుతూ హీరో ఏం చేశాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా లో చూడాలి అంటూ ట్రైలర్ లో కథ ని కొద్దివరకు చెప్పారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా వరకు సినిమా తెలుగు లో వచ్చిన మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఒక్కడు(Okkadu Movie)…

ఎక్కువగా గుర్తుకు వచ్చింది అని చెప్పాలి. ట్రైలర్ మొత్తం హీరో హీరోయిన్ తో పారిపోవడం, వీళ్ళ వెంట విలన్స్ పడటం, ఇదే రిపీట్ అయింది, దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఇంప్రెస్ చేసింది… మొత్తం మీద హరి సినిమాలు అంటే యాక్షన్ పార్ట్ బాగానే వర్కౌట్ అవుతుంది, అందునా ప్రస్తుతం…

కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విశాల్ చేస్తున్న కొత్త సినిమా అవ్వడంతో మాస్ లో మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది, తెలుగు లో టాక్ పాజిటివ్ గా ఉంటే సమ్మర్ లో మంచి కలెక్షన్స్ ను అందుకోవచ్చు. ఇక ట్రైలర్ కి మొత్తం మీద 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here