Home న్యూస్ యావరేజ్ పాట అన్నారు…రికార్డ్ ఔట్ అక్కడా….విజయ్ మాస్ రాంపెజ్!

యావరేజ్ పాట అన్నారు…రికార్డ్ ఔట్ అక్కడా….విజయ్ మాస్ రాంపెజ్!

0

సినిమా సినిమాకి పాటలు, టీసర్ లు అండ్ ట్రైలర్ లతో కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay)…త్వరలో పాలిటిక్స్ లో బిజీ అవ్వబోతున్న ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ నుండి ఫస్ట్ సాంగ్ విజిల్ పోడు(WhistlePodu Song) పాటను…

రీసెంట్ గా రిలీజ్ చేయగా పాటకి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు, రీసెంట్ టైంలో వచ్చిన విజయ్ సినిమాల పాటలతో పోల్చితే విజిల్ పోడు సాంగ్ యావరేజ్ గా ఉంది అనిపించే టాక్ వినిపించగా యూట్యూబ్ లో మాత్రం సాంగ్ కి ఊహకందని రెస్పాన్స్ సొంతం అయ్యింది. వ్యూస్ పరంగా ఏకంగా….

ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తూ ఏకంగా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ప్రీవియస్ సౌత్ రికార్డ్ కూడా విజయ్ పేరిటే ఉండగా ఇప్పుడు మళ్ళీ వ్యూస్ పరంగా కొత్త రికార్డ్ ను విజిల్ పోడు సాంగ్ నమోదు చేయడం విశేషం, లైక్స్ పరంగా మాత్రం కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వలేదు….

మొత్తం మీద 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి విజిల్ పోడు సాంగ్ కి 24.88 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా ఆల్ టైం సౌత్ రికార్డ్ ను ఈ సాంగ్ నమోదు చేసింది. ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో ఈ సాంగ్ 1.254M లైక్స్ ను సొంతం చేసుకున్న సాంగ్ సౌత్ లో ఆల్ టైం టాప్ 5 హైయెస్ట్ లైక్స్ ను అందుకుని….

సంచలనం సృష్టించడం విశేషమని చెప్పాలి…ఓవరాల్ గా యావరేజ్ సాంగ్ అనుకున్న విజిల్ పోడు ఏకంగా వ్యూస్ పరంగా న్యూ సౌత్ రికార్డ్ ను నమోదు చేసి పాట ఎలా ఉన్నా కూడా విజయ్ పేరిట కొత్త రికార్డ్ ను నమోదు చేయడం విశేషం. ఇక సినిమా నుండి వచ్చే ఇతర పాటలకు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here