Home న్యూస్ విశ్వంభర మూవీ టీసర్ రివ్యూ…మెగాస్టార్ మెగా రాంపెజ్!!

విశ్వంభర మూవీ టీసర్ రివ్యూ…మెగాస్టార్ మెగా రాంపెజ్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) భోలా శంకర్ లాంటి డిసాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న భారీ బడ్జెట్ విజువల్ వండర్ మూవీ విశ్వంభర(Vishwambhara Teaser Review)…. ముందు సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా…

అఫీషియల్ టీసర్ ను విజయ దశమి కానుకగా రిలీజ్ చేశారు….టీసర్ చూస్తుంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తూ ఉండగా క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉన్నట్లు అనిపించినా టీసర్ లో మెగాస్టార్ ఎంట్రీ నుండి టీసర్ ఓ రేంజ్ లో హై ఇచ్చింది అని చెప్పాలి…

మెగాస్టార్ లుక్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా కొన్ని గ్రాఫిక్స్ షాట్స్ అంతలా సెట్ అవ్వలేదు అనిపించినా ఓవరాల్ గా గ్రాండియర్ బాగుంది…కథ పాయింట్ ను ఏమి రివీల్ చేయలేదు…..విశ్వం మొత్తాన్ని చీకటి కమ్మేసిన సమయంలో చెడుపై యుద్ధం చేయడానికి వచ్చే శక్తిగా మెగాస్టార్ కనిపిస్తూ ఉండగా…

టీసర్ లో మెగాస్టార్ షాట్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా మిగిలిన పార్ట్ మాత్రం పర్వాలేదు అనిపించేలా ఉంది, మిగిలిన యాక్టర్స్ లుక్స్ మార్వెల్ మూవీస్ నుండి తీసుకున్నట్లు అనిపించగా కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు….సరైన బ్యాగ్రౌండ్ ఉంటే టీసర్ ఇంకా హైలెట్ అయ్యేది…

ఓవరాల్ గా టీసర్ సినిమా మీద అంచనాలను అయితే సాలిడ్ గా పెంచేసింది, డైరెక్టర్ వశిష్ట ఆల్ రెడీ బింబిసారతో బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ సారి మెగాస్టార్ ని ఎక్స్ లెంట్ ప్రజెంట్ చేస్తున్నాడని టీసర్ చూస్తె అర్ధం అవుతుంది….భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా…

వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్న వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. టీసర్ వరకు సినిమా మీద ఉన్న అంచనాలను పెంచేసిన విశ్వంభర ఇక వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here