పెట్టింది 50- అమ్మింది 75…టోటల్ గా వచ్చింది ఇది!

0
342

    కోలివుడ్ స్టార్ హిరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం, తమిళనాడు లో సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా అక్కడ సూపర్ స్టార్ రజినీ సినిమా కి పోటిగా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజుల వేడుకకి రీసెంట్ టైం లో అత్యధిక సెంటర్స్ లో జరుపుకుని కోలివుడ్ మూవీస్ పరంగా రికార్డుల కెక్కింది ఈ సినిమా.

ఇక రీసెంట్ గా తెలుగు లో డబ్ అయిన ఈ సినిమా ను సరిగ్గా ప్రమోట్ చేయని కారణంగా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక ఇక్కడ ఫ్లాఫ్ అయ్యింది ఈ సినిమా. సినిమా ను టోటల్ గా 50 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా టోటల్ వరల్డ్ వైడ్ గా..

సినిమాను 75 కోట్లకు పైగా రేటుకి అమ్మినట్లు సమాచారం, ఇందులోనే తెలుగు మరియు కన్నడ డబ్బింగ్ కూడా కలిపి ఉంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 140 కోట్ల రేంజ్ గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే.

Tamil Nadu – 136 Cr, Karnataka – 11.38 Cr, Kerala – 4.24 Cr, ROI – 3.35 Cr, Overseas – 39.80 Cr, Telugu Version 2.7Cr, Kannada 50L Total worldwide gross 197.97 Cr ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు.

కాగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా షేర్ పరంగా 101 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఏకంగా 26 కోట్లకి పైగా షేర్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవగా కోలివుడ్ లో మాత్రం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!