నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో సమ్మర్ కానుకగా రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా డైరెక్ట్ రిలీజ్ ను రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే ఆ సందడి వేరేలా ఉండేది కానీ ప్రైమ్ వీడియో లో..
రిలీజ్ వలన మొదటి రోజు రివ్యూలు టాక్ తో కొంచం సందడి ఉన్నా రెండో రోజు నుండే కంప్లీట్ గా అసలు చప్పుడు లేకుండా సైలెంట్ అయిపొయింది సినిమా… సినిమా రిలీజ్ తర్వాత కూడా రెండు రకాల టాక్ వినిపించగా ఫ్యామిలీ మూవీస్ ఇష్టపడే వారు సినిమా బాగుందని చెప్పినా…
మాస్ ఆడియన్స్ రెగ్యులర్ మూవీ గోర్స్ అండ్ కామన్ ఆడియన్స్ కి మాత్రం సినిమా అసలు ఏమాత్రం నచ్చలేదు. సోషల్ మీడియా లో కంప్లీట్ నెగటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా నెగటివ్ టాక్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అయింది… OTT రిలీజ్ కాబట్టి…
ఇది పెద్దగా ఎఫెక్ట్ కాలేదు కానీ ఈ సినిమా కనుక థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటేనా భారీ బిజినెస్ కి ఈ నెగటివ్ టాక్ ఎఫెక్ట్ తో ఓ రేంజ్ లో నష్టాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఉండేది… రీసెంట్ గా వచ్చిన సీటిమార్ సైతం ఓపెనింగ్స్ కుమ్మినా నైజాం లో వీకెండ్ కలెక్షన్స్ నిరాశ కలిగిస్తున్నాయి. అదే టక్ జగదీష్ అయ్యి ఉంటే…
భారీ బిజినెస్ కి థియేటర్స్ ఓనర్స్ కి చుక్కలు చూయించి ఉండేది అంటూ ట్రేడ్ వర్గాలు ఇప్పుడు అనుకుంటున్నారు. సినిమా ను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసి చాలా మంచి పని చేశారని, థియేటర్స్ లో ఈ టైం లో వచ్చి ఉంటే కచ్చితంగా దెబ్బ సాలిడ్ గా పడి ఉండేదని అంటున్నారు. సంక్రాంతి లాంటి ఫెస్టివల్ తప్పితే సినిమా మరే టైం లో వచ్చినా దెబ్బ గట్టిగా తాకి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.