Home Uncategorized మహర్షి రిలీజ్ డేట్…ఫ్యాన్స్ కి కోపం!

మహర్షి రిలీజ్ డేట్…ఫ్యాన్స్ కి కోపం!

0

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా మహర్షి ఈ ఇయర్ సమ్మర్ కానుకగా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా ముందుగా నిర్మాత దిల్ రాజు సినిమాను ఏప్రిల్ 5 న కన్ఫాం చేయడం తో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో అటు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల నుండే భారీ గా కలెక్షన్స్ తో సినిమా దుమ్ము లేపుతుందని అందరు ఫిక్స్ అయిపోయారు.

కానీ షూటింగ్ లో జరిగిన జాప్యం కారణంగా ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 25 కి ఫిక్స్ చేయగా ఫ్యాన్స్ మాత్రం ఒకింత టెన్షన్ తో పాటు కోపంగాను ఉన్నారు, ఒక్క రోజు తేడా తో హాలివుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ అయిన అవెంజర్స్ ఎండ్ గేం భారీ గా రిలీజ్ అవుతుండగా…

ఇండియా లో కూడా సినిమా పై భారీ ఎత్తున క్రేజ్ ఉండటం తో ఆ సినిమా కి పోటి వలన థియేటర్స్ సంఖ్య ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, దాంతో పాటే ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై కూడా గట్టిగానే చూపే అవకాశం ఉండటం తో ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.

ముఖ్యంగా ఓవర్సీస్ లో ఆ సినిమా పై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు, దాంతో షోలు మొత్తం ఆ సినిమాకే కేటాయించడం ఖాయం, అలాంటిది ఆ డేట్ ని ఓవర్సీస్ లో క్రేజ్ ఉన్న మహేష్ కి కేటాయించడం వలన కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో లేకపోతె ఓపెనింగ్స్ ఉండవని…

ఆ డేట్ కన్నా కూడా ఏప్రిల్ 21 లేక మే 1 మహర్షి కి బెస్ట్ డేట్స్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో నిర్మాతలకు చెబుతున్నారు, మరి నిర్మాతలు రిలీజ్ డేట్ విషయం లో ఇదే ఫైనల్ అంటారా లేక ఏమైనా ప్రీ పోన్ లేక పోస్ట్ పోన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here